138
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
ర్శనమున్ జేయఁగఁ గోర్కెగల్గె: నిదెయాజ్ఞన్ వేగఁ బాలింపవే"
యనిమామన్ జయమల్లుఁ బంచెను బ్రతాపాధీకుశు నర్థింపగన్ 234
చ॥ కదిసి ప్రతాపసింహనృపుఁ గార్యమతం డెఱిఁగించె సమ్మదా
స్పదుఁడయి భూవిభుండు దయ సాగరసీమను జూతు'నన్నవా
ర్తఁ దెలిపె నాతఁ, డిచ్చటఁ బ్రతాపుఁడు నచ్చట మానసింహుఁ డ
య్యుదయపురంబుఁ జేర గమనోన్ముఖులై చని చేరిరిర్వురున్ 235
గీ॥ అన్నియును బర్ణశాలలే, యంతరమున
నన్ని దర్భాసనంబులే, యన్నిచోట్ల
నతినిరాడంబరత్వమే, యందఱ ముఖ
ముల నమాయకత్వంపు ముద్రలె, రహించె 236
గీ॥ అచటి యందఱు భోగసన్యాసిమణులు
పరమహంస ముఖ్యుఁడు ప్రతాపప్రభుండు
పజ్జ నున్న గంభీరా స్రవంతి వోలేఁ
బరమ గంభీర మందఱ భావవృత్తి. 237
గీ॥ అతుల సువిశాల పర్ణి శాలాంతరమున
మృదుల దర్భాసనంబులు పదిదనర్ప
నొక్క దానిపైనఁ బ్రతాపుఁడుండె నతని
చెంతనే సలుంబ్రా కృష్ణసింహుఁడుండె. 238
--* మానసింహప్రభువు ప్రతాపసింహుని దర్శించుకొనుట *--
సీ॥ వజ్ర దీధితులు శుభ్ర కపోలములపైన
నాట్యమ్ము సలుపు కుండలము లలరఁ
బరమదుర్లభ మహాభాగ్యరేఖ లెసంగు
రమణీయ దీర్ఘ నేత్రములు దనర
సౌందర్య దేవతా సదనమై సంపూర్ణ
చంద్రుని గేరు నాస్మంబు వెలుఁగ
క్షితి నెల్లఁ ద్రుటిని వశీకృతి గావించు
భూరి లక్షణ దివ్యమూర్తి యమర