ద్వి తీ యా శ్వా స ము
137
ధ్వజినీ పతిత్వ సంబంధంబు సామంత
భావంబు వియ్యంబు బాంధవంబు
నేండ్లు పూండ్లును దాటు హితవృత్తి యెల్లప్డు
సముఖమ్మున మెలంగు చనపు కలిమి
గీ॥ పయిని నొకవేయి సంబంధ బంధములును
దొడరిపూల సంకెలలు నామెడనుబడుచుఁ
గట్టువడినాఁడ నీపాద కమలములకు
నాతనికిఁ గూర్తునే! నిన్నె యనుసరింతు 229
గీ॥ ఉదయపురిపైన దండెత్తి కదియఁబోకు
స్వల్పరాజ్యము. నీఢాక సైపలేదు
మృదుశిరీష పుష్పమ్ము తుమ్మెదయెవ్రాల
నోర్వదు! ఖగేశ్వరుడు త్రొక్క నోర్వఁగలదె" 230
చ॥ అన “సరిః యట్లుచేయు ' మన నక్బరు "పెక్కురు కార్యదక్షుల
బనిచితి' రెండుసారులుగ వారలు ఘూర్జరదేశ మేగి యం
దునఁగల రాజ్యకార్యములు తోఁచిన యట్టులు తీర్చి' రైనఁ బా
లనము స్ధిరత్వముగా గనిన లాగగుపింపదు పెక్కులేండ్లకున్ 231
--* మానసింహప్రభువు ఘూర్జమునకు వెడలుట *--
క॥ అనిన "నదియెంతపని లె
మ్మని పలుకుచు మానసింహుఁ డామఱునాఁడే
తనవెంటఁ గొంతసైన్యముఁ
గొనుచుఁ బ్రయాణం బొనర్చె మూర్జరమునకున్ 232
చ॥ చనియటనున్న కార్యములు సర్వముఁ దీఱిచి యుత్తమ వ్యవ
స్థను నెలకొల్పె రాజ్యరమ సర్వసుఖంబులు గాంచి వృద్ధినొం
దెను; బలవంతుఁడు బ్రబలు నిర్ఝర మెంతటి దుర్గమస్థలం
బునయినఁ జీల్చి చొచ్చుకొని పోవునటంచను పల్కునిల్పుచున్. 233
మ॥ తనయంబర్ పురిఁ జేరఁగా మఱలి మధ్యన్ గల్గు మార్గంబునన్
జనుచో నొక్కెడ మానసింహుఁడు "కడున్ సద్భక్తి నీపాద ద