ద్వి తీ యా శ్వా స ము
131
బునకున్ రెండవమాఱు సేనల రణంబు జేయఁగా నక్బరున్
గొనిపోయెన్ సచరాచరావని వడంకున్ బొంది శోషిల్లఁగన్. 203
సీ॥ ఉభయసేనలకు మహోద్ధత యుద్ధంబు
పడియె నహమ్మదాబాదు పొంత
నక్బరుపతి ఘోర్ఖరాధిపు రణరంగ
మందుఁ బెల్లుగఁదాఁకి బందెఁ గొనియె
సమర మంతయు నొందె జయ మక్బరు వరించె
ఖాండీషు కైరాయు గదియవాడ
కాంబె బ్రోచియు రివాకాంత మాహీకాంత,
రాధాపురంబు సూరతు బలిస్న
గీ॥ పయి బరోడా యహమ్మదాబాదు మఱియుఁ
బాలనపురాది బహుమండ లాలి యవన
సార్వభౌముని మృదుపదాబ్జములు చేరి
యేఁబదియు లక్షల ధనంబు నియ్యఁదొడఁగె. 204
-: అక్బరుసార్వభౌముఁడు వంగదేశమును జయించుట :-
మ॥ వరుసన్ వంగ విహారముల్ కొనఁగ నక్బర్ కోరె; నాసీమలన్
బరిపాలించె సుఖప్రదమ్ముగ సులేమాన్ ఖానుఁ; డావీరుఁడున్
మరణం బొందినమీదఁ దత్సుతుఁడు సమ్రాట్టయ్యె దావూదు ము
ష్కరుఁడై లోకుల బాధపెట్టుచును రాజ్యంబేలె వాఁడయ్యెడన్. 205
సీ॥ ధనము లక్షలు కోట్లుదనరె నర్వది వేవు
రాశ్వికుల్ మూఁడువేలాఱునూర్లు
ద్విరదంబు లిర్పదివేల్ పిరంగులను ల
క్షయును నల్వదివేలు కాలిబంట్లు
పదినూర్లు యుద్ధనావలు గల్గి దావూదు
చక్రవర్తిని లెక్క సలుపఁబోక
సరిహద్దు నందున్న 'జామేనియా' దుర్గ
మును సేనలను గొంచు ముట్టడించె