పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


   నరులు సోఁకమి స్వేచ్ఛఁబెరుగుచు నొకటికి
              వేయిగా మృగములు వృద్ధినొందె
              
గీ॥ నలఘు రావీ వనాశాంతరావనీత
   లము లతావృక్షమృగవిహంగమవృతమయి
   దేవ దానవులకు నైనఁదేరి చూడ
   రాక చొరరాక మృత్యు వక్త్రముగఁ దనరె. 190
   
గీ॥ తరులు రాపాడు మ్రోత వాతముల మ్రోత
   మృగవితతీ మ్రోత పలు సెలయేళ్ల మ్రోత
   ఖగ తతుల మ్రోత గలిసి యోంకార నాద
   మెపుడు నల్దెసలందుఁ బైకెగయు చుండె. 191
   
మ॥ ఒకమాఱా'బదనూ' రరణ్యములలో నుద్దండులై శత్రు సై
    నికులేతేరఁగ నాప్రతాప విభుఁడున్ వీక్షించి యాత్మీయ సై
    న్య కదంబులతోడ వచ్చి మదశుండాలమ్ములన్ జీల్చు సిం
    హకిశోరంబటు దాఁకి కూల్చెను జగంబౌరా యటం చెన్నఁగన్. 192
    
ఉ॥ వేఱొకసారి ఇట్లె పదివేలభటుల్ షహబాజుఖాను చి
    త్తూరికి వెళ్ళుచుండఁగ మహోగ్రవనంబున ముట్టడించె వా
    రూఱక నిల్చిరందఱు దయోదయుఁడౌచుఁ బ్రతాపుఁ డంత సం
    హారము సేయకే విడిచె నద్దిర! యాతని ధర్మ మెట్టిదో. 193 193
    
సీ॥ గొల్లలు మేకలఁగొని మేపుదు రటంచు
             బచ్చిక బయళులఁజొచ్చి చూచుఁ
    గాఁపు పొలాన నాఁగలి మోపునో యంచు
             దూరప్రదేశముల్ తొంగి చూచు
    వేఁటరుల్ మెకములపిండుఁ జంపుదురంచు
             ఘోర వనంబులుదూరి చూచుఁ
    దరుల బోయలును వాగుర లొడ్డుదు రటంచు
             గొండపేటెక్కి యందుండి చూచు
             
గీ॥ నాసలుంబ్రాధిపతి వెంటనంటి యుండ
     దేశ మెల్లెడఁ దిరిగి శోధించు చుండుఁ