పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర



గీ॥ మహిత కష్టానుభూతి ధర్మంబు పొలుచు
    నపజయంబుల నది తగ్గ కతిశయిల్లు
    గాన విజయంబె ముఖ్యంబు గాదు మనకు
    ధర్మనిర్వహణంబు కర్తవ్య మెపుడు! 181
    
సీ॥ ఉదయమే లేచి ఱేపుదయపురము వీడి
          కుంభల్ మియర్ కోటకును జనుదము:
    పదివేల పల్లెల ప్రజలు స్వస్వనివాస
          ములు వీడి యచటికే పోవ వలయుఁ;
    బొలములుదున్న నాఁగలి మోపఁగారాదు;
          పశువుల నెచట మేపంగరాదు;
    బాటల నెవ్వరు పయనింపఁగారాదు;
          కూపముల జలంబుఁ గ్రోలరాదు:
          
గీ॥ వనమృగం బొక్కఁడైనఁ జంపంగరాదు;
    మరచియో తప్పియో చెట్టెనఱుకరాదు;
    కేలనొకగడ్డిపోఁచయు గిల్లరాదు;
    గిరులు విడనాడి బయలులఁ దిరుగరాదు.182
    
శా॥ నీరంధ్ర ద్రుమ పుంజ రంజితమునై నిద్రాణ నానామృగ
    స్ఫారంబై భయదాంజనాచల ముటుల్ వ్యాపించె నాజీకటుల్
    బారై యంబరుదేశమాదిగ సలుం బ్రాసీమయున్ దాఁక బ్ర
    హ్మారణ్యం బగుఁగాక దేశము జనం బం దేగరాకుండఁగన్. 183
    
క॥ తనకించకయును లాభము
   దనరదనుచు నక్బ రెఱిఁగి దండెత్తక యుం
   డిన నిరుదెగలకు మేలగు
   మన ముందము కొన్ని నాళ్లు మౌనము తోడన్ 184 184
   
సీ॥ తతహరిశ్చంద్ర మాం ధాత్రాదులు చరించు
             వజ్రాలబాట నా భానుకులము
   నరమాత్రుఁ డొకని కే శిర సొగ్గి యిక్ష్వాకు
             లకు మసిసోఁక నో ర్చుకొనలేను