పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/159

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    తరతరంబులుగ స్వాతంత్య్రలక్ష్మీ మహో
             దయముఁ గోరి విదేశధరణి పతుల
    మాఱొడ్డి బాహు శుంభత్ప్రతాపముఁజూపి
             ధనధాన్య వస్తు వాహనయుతముగ
    సర్వార్పణ మొనర్చి శాశ్వత ధన్యత్వ
             మందు డెవ్వరికి వంద్యంబుగాదు
             
గీ॥ హృదయము గలట్టి మానవుండెవఁడు వారి
   యడుగులను గొల్చి యహితుల నణఁచి జన్మ
   పావనము సేయఁ డాతని బ్రదుకదేల
   బల మదేల నిరర్ధకైశ్వర్య మేల. 165
   
మ॥ అకటా! ముప్పదికోట్ల హైందవులు మోయన్ దగ్గ భారంబుఁ గొం
    కక నీవొక్కఁడ వెత్తికోఁదలఁచి తింకన్ నిన్ను సేవించి గొం
    తుక లర్పించెడు వారు పూజ్వులగు భక్తుల్ నీపతాకంబు క్రిం
    దికి రానొల్లని వార లందఱును మాతృద్రోహులున్ వంచకుల్. 166
    
మ॥ పొదలన్ వెల్వడు దొడ్డక్రోలుపులు లేపున్ జూపు నాసింగపుం
    గొదమల్ వీరని శాత్రవుల్ బెదురు నుక్కుందుంటలున్నార లేఁ
    బదివే ర్లెంకలు భిల్లవంశజులు నీపాదాబ్జముల్ గొల్వ నే
    కొదలేకుండఁగ నందఱన్ బనిచి నీకున్ బ్రీతిఁ గావించెదన్. 167 167
    
సీ॥ వెదురు పొదలనుండి ప్రిదిలిన యాణిము
              త్యములు కుప్పలు కుప్పలై రహించు
    ఫణి ఫణాగ్రములందుఁబండి రాలిన మణుల్
              పరుపులు పరుపులై ఫరిఢవిల్లు
    గనుల మొల్చిన యనర్ఘస్వర్ణ రౌప్యాది
              లోహముల్ పెనుకొండలుగఁ దనర్చు
    శైలసానువులలోఁ జంద్రకాంతశిల లీ
              జగ మంతటికినైనఁజాలియుండుఁ
              
గీ॥ బెరుగుటయే కాని తఱుఁగుట యెఱుఁగనట్టి
    రత్న గర్భ సార్ధముగ నారాజ్య సీమ