ద్వి తీ యా శ్వా స ము
109
మ॥ వడకించెన్ సచరాచరావనిఁ బ్రతాపస్ఫూర్తిఁ జిత్తూరు ము
ట్టడియ ప్డర్జునరావు; శూరధనుఁ డిష్ట శ్రేష్ఠుఁ డమ్మాన్యు పు
త్రుఁడు మాతండ్రికి మేనమామకొడుకెంతోకూర్చు వాఁడయ్యు నన్
విడి ఢిల్లీశ్వరుఁ జేరె నీకధలు విన్పింపంగ సిగ్గయ్యెడిన్. 112
మ॥ దురదృష్టంబదియెల్ల నాపయిని గంతుల్ వెట్టెఁ గాదేని సా
గరుఁ డప్పద్మహితాన్వయం బపయశఃకాలుష్య మొందంగ న
క్బరు పాదాబ్జముఁగొల్వ నేలచను హృద్బంధుల్ హితుల్ సోదరుల్
పరునిన్ జేరిరి మందభాగ్యమున కెబ్బంగిన్ వగన్ గాంతునో. 113
మ॥ అకటా! సూక్తుఁడకారణంబుగనె కయ్యంబెంచి వాదాడి ఢి
ల్లికి వేంచేసెను నిన్న; శత్రుజనపాళిన్ దున్మి తూఁటాడు సిం
హకిశోరంబులు తమ్ము లిట్లగుటకై యస్మ న్మనంబెట్టి బా
ధకు లోనయ్యేనొ దేవుఁడే యెఱుఁగు నిద్రన్ గాన రేయంతయున్.114
సీ॥ సువిశాల దుర్నిరీక్ష వికాస మక్బరా
స్థానరంగ ప్రధాతతికి బ్రమసి
యాశ్రయించినవారి యాసలన్నియుఁదీర్చు
నతని వింతగు వదాన్యతకు నలరి
తమపేరు జగమునంతకుఁ బెద్ద రారాజు
పేరుతో జతగూడు పెంపునెంచి
కనకసౌధాగ్ర భాగములందుఁ దెరలలో
విహరించు తురక బిబ్బీలఁ దలఁచి
గీ॥ సేతు శీత నగాంతరసీమఁ గలుగు
మనుజపతులెల్ల మతిచెడి కనులు తిరిగి
విడని పేరాస సక్బరు విజయరథము
కాడి మోసిరి స్వాతంత్య్ర ఘనత మఱచి.115
మ॥ కనుసన్నన్ ననుఁగొల్చు భూపతులు మోగల్ ఱేని గుఱ్ఱాలు గా
యను వేంచేసి రనేకదుర్గ వితతుల్ హారావళీ పర్వతా
వనిదక్కన్ రిపుచేతఁజిక్కెఁ జమువుల వమ్మయ్యె భాండారముల్
ధనశూన్యంబు లికెట్లు నిల్పనగు స్వాతంత్య్రంబు మేవాడకున్.116