108
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
దద్ఘాతములకు నాతల్లి శరీరమ్ము
కుమ్మెలు పోవుచుఁ గుట్టుపట్టె
నుపచారశతముల నొళ్ళుపెట్టదు చిక్కి
విద్రుపలై శల్యావశిష్టమయ్యె
గీః॥ నమ్మహామాత గతి తలఁపైనయప్పు
డొడలు పరవశమై రక్తముడుకు లెత్తుఁ
గడుపు చుమ్మలు చుట్టు నేకరణి నామెఁ
దేర్తునని రేయుఁబవలు చింతించుచుందు. 108
మ॥ తనలోకావన కచ్వహాన్వయము పాతాళంబునన్ గ్రుంగఁ బు
త్రిని ఢిల్లీశున కిచ్చి వియ్యమును బ్రీతిన్ గూర్చి తత్పుత్రు నా
తని కర్పించెను మానసింహు భగవాన్ దాసుండు తొల్దొల్త నే
మని వర్ణాశ్రమ ధర్మపద్ధతి తిరంబై నిల్చు లోకమ్మునన్. 109
సీ॥ తనయంతరాజు లేఁడనిపించి విస్తార
భూమి మార్వారేలు భూపమౌళి
యుదయసిం గక్బరునెదురేగి తోడ్తెచ్చి
తనరాజ్యలక్ష్మి స్వాతంత్య్రలక్ష్మి
నొసఁగుచు సోదరీయోధబాయి నొసంగి
యేకసహస్ర హయేశుఁడయ్యె
ననుజుని జంద్రసేనుని నిజాత్మజు శూర
సింహు ఢిల్లిని సేవచేయఁ బనిచె
గీ॥ బదులుగా నక్చరొకకొన్నిపల్లె లియ్య
నతని సామంతుఁడగుచు రాజ్యంబొనర్చు
ధీరుఁడెవఁ డధీరుఁడెవండు వీరనృపులె
సిగ్గుచెడి తగ్గుకూటి కాసించి నపుడు 110
మ॥ బికనీరీశ్వరుఁడున్ జసల్మియరు వృధ్వీనాధుఁడున్ వారి క
న్యకలన్ ఢిల్లీకిఁ గాన్కగాఁబనిచి సేనాధీశ సామంతులై
సుకమున్ గోరుచు నక్బరున్ గొలువఁగాఁజొత్తెంచి రిట్లెందఱో
యకటా సోదర భూపతుల్ చెడిరి హేయంబైన దాస్యమ్మున్.111