పుట:భాస్కరరామాయణము.pdf/405

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్ఫోటన దాఁటుచుం జెలఁగుచుం బొరి నూఱులు వేలు లక్షలుం
గోటులు దాఁటు లై వడి నొకొండొకనిం [1]గడవంగ భూమిభృ
త్కూటములుం దరుల్ గిరులుఁ గొంచు రయమ్మున వచ్చి వారిధిన్.

237


క.

వడి వైచుడు నంబుచ్ఛట, లుడుమార్గము గడవ నెగయ నుగ్రధ్వనితోఁ
బడుచు నవి మగుడఁ బొడమక, యడఁగెడుచందంబు చూచి యక్కపివీరుల్.

238


తే.

మరలి జననాథుపాలికి నరుగుదెంచి, దేవ నిమ్నగావిభుఁ డన్నతెఱుఁగు గాక
యేము వైచినతరులు మహీధరములు, మునుఁగుచున్నవి తోడ్తోడ వనధియందు.

239


క.

అని విన్నవించుసమయం, బున నవ్విభుతో నదీవిభుం డి ట్లను నీ
వనచరులు తరులు గిరులుం, గొనిరా నీనలుఁడు వైవఁ గ్రుంకక తేలున్.

240


ఆ.

మొదట నొక్కతరువు మునిఁగిపోవక యుండ, నితఁడు వైవఁ బిదప నెల్లవారుఁ
దరులు గిరులు దెచ్చి దళముగాఁ దమతము, వలసినట్లు గట్ట వైచు టొప్పు.

241


క.

ఇంతకు మును వైచినయని, యంతర్గ్రాహములు మ్రింగె ననవుడు నబ్భూ
కాంతుండును నరు దందుచు, నెంతలు జలచరము లుండు నీగతి ననుడున్.

242


క.

తిమి యన శతయోజనమా, త్రము గల దొకమీను దాని రఘువర యొకమీ
నము మ్రింగు మ్రింగు నమ్మ, త్స్యము నొకఝష మిట్లు గలవు దత్తద్గిలముల్.

243


క.

[2]అయినను నంతంతకు న, మ్మెయి నుగ్రగ్రాహకులము మెలఁగఁగ నీపై
పయి నెగయువిచలవీచులు, వయిచినయని తూలజడియ వడిఁ దెరయెత్తున్.

244


వ.

అనిన నవ్యాక్యంబులకు సంతోషించుచుఁ బ్లవంగపుంగవు లార్పులు నింగిఁ జెలంగ
దిశాముఖంబులకు బహుముఖంబులం జని పర్వతపాదపాదులం దెచ్చి రాసమ
యంబున నంబుధిచేత ననుజ్ఞాతుం డై రామచంద్రునాజ్ఞ శిరంబున ధరియించి
విశ్వకర్మం దలంచి.

245

వానరులు సేతువు గట్టుట

శా.

విఘ్నేశాయ నమోనమో భగవతే శ్రీ వేదండతుండాయ ని
ర్విఘ్నక్షేమకృతే నమోస్తు భవతే విశ్వప్రభో యంచుఁ గ్రౌం
చఘ్నజ్యేష్ఠుఁ బ్రసన్నుఁ జేసి నలుఁ డుత్సాహంబుతో నద్భుతో
పఘ్నధ్వానము గాఁగ నొక్కనగ మొప్పన్ వైచె నంభోనిధిన్.

246


ఉ.

వైచిన నాకలోకమున వారికి వారిధిపంపు పూని దో
షాచరనాథుచేటు వినఁ జాట జలచ్ఛట లేగఁ దాను వే
వే చని చెప్పి వచ్చె నహివీరుల కన్నటు లూర్ము లొక్కపె
ల్లై చెదరన్ మునింగి వెస నగ్గిరి దేలెఁ గపీంద్రు లార్వఁగన్.

247
  1. ‘గడఁబాఱుచుం గుభృత్కూటములుం.' వ్రా. ప్ర.
  2. అయినను నది యెంతకేని మెయి...మెలఁగం గని పైపయి ..... వయిచిన నది తూలఁ జడియఁబడి తెర లెత్తున్.