పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/423

ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి

399


సంతకము చేసిరి. ఈ కమిటీవలన నెట్టి ప్రయోజనము కలుగలేదు గాని, దేశములోని జాతీయవాదులకు మితవాదులకు గూడ సత్వర స్వరాజ్య కాంక్షయున్నట్లు మాత్రము వెల్లడింపబడెను. మఱియు ఏ రాజకీయ సమస్యనైనను పరిష్కరించుట కని చెప్పి ఒక బూటకవిచారణ సంఘమును నియమించి కాలయాపన జేయు బ్రిటిషుప్రభుత్వ రాజ్యతంత్రపద్దతి మఱియొకమారు వెల్లడియయ్యెను.

ఆరవ ప్రకరణము

గాంధీసత్యాగ్రహము - ఇర్విన్ సంధి

I

అధినివేశ స్వరాజ్యము

బ్రిటిషుప్రభుత్వమువా రెంతతీవ్రమైన నిర్బంధ విధానముసు ప్రయోగించినను భారతదేశప్రజలందు స్వరాజ్యకాంక్ష నానాటికి ప్రజ్వరిల్లసాగెను. దేశములో కాంగ్రెసు చేయుచుండిన రాజకీయ ప్రబోధమేగాక ప్రపంచ పరిస్థితులుకూడ ప్రజలకు స్వాతంత్ర్యాభిలాషకు ప్రోద్బలము కలిగించుచుండెను. బ్రిటీషు సామ్రాజ్యమునందు ఇంగ్లాండుకు అధినివేశ రాజ్యములకుగల పరస్పర సంబంధములుగూడ భారతీయుల రాజకీయ ఆశయములకు దోహద మొసగసాగినవి. ఐరోపా సంగ్రామము మొదలు సామ్రాజ్యసభలందు సామ్రాజ్యములోని కెనడా మొదలగు స్వతంత్రభాగముల ప్రతినిధులతోపాటు అస్వతంత్రదేశమగు భారతదేశ ప్రభుత్వ ప్రతినిధులు గూడ పాల్గొనుపద్ధతియు అంతర్జాతీయ మహాసభయగు