6
బసవపురాణము
శరణుఁడై బసవండు సందు సేకొన్నఁ - బరమభక్తి స్థితి బసవన్న గొలుచు
భక్తుఁడై లింగంబు ప్రకృతి సేకొన్న - వ్యక్తిగా బసవన్న వరవుడు సేయుఁ
బరమాత్మరూప మా బసవఁడే యెఱుఁగుఁ - బరమేశుఁ డెఱుఁగు నా బసవనిరూపు
సాలోక్యసామీప్యసారూప్యపదవు - లోలిని బొంద సాయుజ్యంబుఁజెంద
వచ్చుఁగాకిల బసవస్వామి గాఁగ - వచ్చునే [1]పెఱపెఱవారలకెల్లఁ
బ్రమథాగ్రగణ్యుండు బసవఁడీశునకు - సమశీలభక్తుండు జంగమంబులకు
లింగదేవునకు ననుంగు బసవఁడు - జంగమకోటికి సడిసన్నదాసి;[2]
యెక్కంగ వాహనం బీ[3]శుకు బసవఁ;- డెక్క సింహాసనం బీశుభక్తులకుఁ
గాలకంధరు కరవాలు బసవఁడు; - శీలం[4]బు భక్తుల చేతియద్దంబు;
బసవని నేరి కౌఁబ్రస్తుతి సేయ - [5]వసమె [6]యెవ్వరికైన బసవని నెఱుఁగ
సంపన్నుఁడై లింగజంగమంబందుఁ - బొంపిరిగొని పువ్వుఁగంపునై యుండుఁ
గావున బసవని గణుతింపరామి - దేవాసురులకైనఁ దెల్లమై యుండు;
నెన్నంగ వేడ్కకాఁడెఱుఁగునే దోస- మన్నట్లు గాక యాహవణి గీర్తింప
నిదియుఁ గోటికిఁబడగెత్తినవానిఁ - బదివేల కాఁపవై [7]బ్రదుకు మన్నట్టు
లాపరంజ్యోతిస్స్వరూపంబునకును - దీపకంభంబు లెత్తించినయట్లు
భవనిర్మితములైన పత్రపుష్పములు - భవునకుఁ దగ సమర్పణ సేయునట్లు
గాక కీర్తిం[8]పఁగా నాకుఁ దరంబె - ప్రాకటంబుగ భక్తబండారి[9] చరిత?
మైనను [10]లోకహితార్ధంబు గాఁగ - నా నేర్చుకొలఁది వర్ణన సేయువాఁడ
నవరసరసికత [11]భువినిఁ బేరుగొన్న - శివకవిప్రవరులచిత్తంబు లలర
నిప్పాట నితరులఁ జెప్పెడి దేమి - తప్పనఁదారులు దడఁబడఁబలికి
వెలసినచదువులు [12]వీటిఁబోరిత్త - పొలిసిపోయిరి తమపురులు [13]దూలఁగను
మృడుమహత్త్వముఁగానమిని బొంకులనఁగఁ - బడుఁ “గవయఃకింనపశ్యంతి” యనుట
యనుచుఁ గుకవుల గీటునఁ బుచ్చి పేర్చి - వినుతింతుఁ [14]దత్కథావిధ మెట్టులనిన:
- ↑ పేర్వేఱు, పెదపెద్ద
- ↑ దాసుఁడు-అనవలసినచోట నీతఁడు 'దాసి' యని ప్రయోగించుచు. “విష్ణుఁబాసి వ్యాసుఁడు శివుదాసి గాఁడె,” “నుతికి మెచ్చిచ్చెఁ గన్నులు గాళిదాసికి,” “నీదాసి నీలెంక నీడింగరీఁడ” చతుర్వేదసారసూక్తులు. “చెన్నారఁ గాళిదాసియు శివుచేతఁ గొన్న-(కాళిదాస కవినిగూర్చి) పండితారాధ్య4.ప్రకరణము 31పుట
- ↑ జెప్పు డీశ్వరునకెక్క
- ↑ పు
- ↑ బసవని నెవరికి నెఱుంగ
- ↑ రుమహిమ
- ↑ ప్రబలు
- ↑ తునా గానాఁ
- ↑ భక్త
- ↑ ని బేర్కొన్న
- ↑ దారలు (తప్పనదారులు?)
- ↑ వీటఁబో
- ↑ మాలఁగను
- ↑ నిక్కథవిధ