పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

ధయును అందు విప్రదుర్మంత్రంబును శివుం డంత్యజులరూపుం బంపించిన వచ్చి యాయమ్మగృహంబున నారగించుటయు అందు విప్రవిజృంభణంబును తన్మందిరలక్షణంబును భక్తనిందాఫలంబును శివశాసనమహిమయు చెప్పుటయు మరియు నంత్యజుం డంతర్హితుండై గృహాంతరంబున నురులింగమై యవతరిల్లుటయు ఆప్రసంగవశంబున భోగిదేవయ్యకథయును సామవేదులకధయును అందును మానహితంబుగా నీశ్వరుం డంత్యజుండై వచ్చుటయు ఆవేషంబు భజించిన సామవేదికి పాదోదకప్రసాదోదకలింగోదకంబులు సంభవించుటయు ఆవాహనస్థాపన సన్నిధాపన సమ్ముఖీకరణ సన్నిరోధనమస్కారంబుల శివున కారగింపంబెట్టి పురాతననిందోస్తుతి జేయుటయు విధినిషేధధర్మకులనిరసనశుద్ధభక్తియు భక్తకథాకథనంబులు చెల్లుటయు తిరునాళ్లప్రోవకథయును కక్కయ్యకథయును గుడ్డవ్వకథయును శివనాగమయ్యకథయును జెప్పి సూరసానమ్మ మెరయుటయును యారాథ్యదేవరలింగార్చనోపక్రమంబును అందు పంచశుద్ధి సకలీకరణాభ్యాస యోగసోహమౌనస్నానధ్యానజపతప ఆవరణసింహాసన పూజానిరసనంబును తన్నిమిత్తోపకృత భక్తగుణోత్కర్షయు యారాథ్యదేవరలింగస్వరూపదర్శనవైభవంబును లింగంబునందు గాఢదృష్టిపటుత్వంబును దృష్ఠవిన్యాసంబును దృష్ఠివివీనంబును దృష్ఠినిర్వికారంబును దృష్ఠిసుభామృతంబు గ్రోలుటయు స్వర్శనసుఖంబున వ్రాయుటయు స్తోత్రపఠనోత్సవంబును తనుగుణవిలీనంబును అంగవిక్రియోపచారంబును సానురాగోపచారంబును లింగప్రార్ధనయు పండితేంద్రుగుణకీర్తనంబును అవస్థాంతరజనితమర్మవ్యాఖ్యానంబును పండితేంద్రుండు దనలింగంబులోన జంగమంబు గని మ్రొక్కుటయు లింగ మంతరీక్షంబున నుండుటయు జంగమంబు లింగమయంబుగా నిర్న్నయించుటయు యాయయ్యలింగంబునకు దోస్తలం బొగ్గిన భక్తిమహిమయు భక్తపూజావిశేషంబును ఉత్తమమధ్యమాధమపూజయు సమయానుష్ఠానంబును త్రివిధస్థలనిర్న్నయంబును భక్తసేవయు నుపన్యాసంబు చేసి శూలియందు సొచ్చి వర్తించుటయు తత్ప్రసంగజనితంబున బసవరాజుచరిత్రంబును అందు బసవసంభవంబును పూర్వకర్మనిరసంబును గంగమాంబాపరిగ్రహణంబును దం