పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/425

ఈ పుట ఆమోదించబడ్డది

ఈశుద్ధపత్రముక్రింద అచ్చుపొరపాటు అక్షరములను కొన్ని వ్రాయించితిమి.

ఈపండితారాధ్యచరిత్రము పురాతనమహాకవియగు పాల్కురికి సోమనారాథ్యులే పురాతనగ్రంథమని పేర్కొనినకతంబున పండితపరిష్కృతము అని వ్రాయించమైతిమి. మహాకవి యనుటకు నుదాహరణము. బసవపురాణము ప్రథమాశ్వాసము.

సీ.

లిపి లిఖింపకమున్న యపరిమితార్ధోక్తి
           శక్తి యాతనిజిహ్వ జరుగుచుండు
ఛందాది కరణాది సరణి జూడకమున్న
           మది నుండు కావ్యనిర్మాణశక్తి
భాష్యసంతతులు చెప్పంగ జూడకమున్న
           రుద్రభాష్యక్రియారూఢి వెలయు
తర్కశాస్త్రాదివిద్యలు పఠింపకమున్న
           పరపక్షనిగ్రహప్రౌఢి వెలయు


తే.

నతని నుతియింప నాబోటి కలవి యగునె
జైనమస్థక విన్యస్థ శాతశూల
కలితబిజ్జల తలగుండు గండబిరుద
శోభితుడు పాల్కురికి సోమనాభిదుండు.