పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

బును సిద్ధవటమహత్వంబును నందిమండలమహత్వంబును అలంపురిమహత్వంబును కూడలి సంగమేశ్వరనివృత్తి సోమశిలమహత్వంబునుం గూడి శ్రీపర్వతంబు ముప్పదిరెండుయోజనంబులు నొక్కమాత్రలోన వివేకించి యాయ్యయ్యకు సర్వాంగాలింగితనమస్కృతుండై యమ్మహాత్ముననుమతంబున శ్రీశైలంబు డిగ్గి యంతవృత్తాంతంబు గురులింగజంగమంబునకు విన్నవించి తత్కపాసన్నిహితుం డగుటయు పండితేంద్రుండు తనకుమారులం కేదారదేవతనుభక్తపట్టంబు గట్టి సంసారమాయాసంభవంబున శివలింగదేవు గీర్తించి లింగకర్భంబు జొచ్చుటయు ననువృత్తాంతంబుల నొప్పి మూడువేలయాపదిద్విపదలం గలిగియుండు బర్వతప్రకరణంబును పంచప్రకరణంబులుంగూడ పదనకొండువేలయెన్మనూటపదకొండుద్విపదాబ్జంబులచేత పూజింపంబడు పంచప్రకరణంబులను పంచవక్త్రంబులతోడ నారాధ్యదేవుచరిత్రంబును లింగమూర్తి కనీభవించి శోభిల్లు నది యెట్లనిన.

శ్రీ శ్రీ శ్రీ॥


చాయాకాయా ద్వయోనాస్తి మాయావిద్యా ద్వయోన్సహి।
నిర్వికారం నిరాధారం నిష్కళం పరమామృతం॥


1.

నిర్గుణో నిష్క్రియోనిత్యో నిర్వికల్పోనిరంజన।
నిర్వికారో నిరాకారో నిశ్చబ్దో నిర్మలోచలం॥


2.

కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిశశీతలం।
స్వయంజ్యోతి పరబ్రహ్మ చిదాకాశమయం శివం॥


3.

వ్యోమాతీతం పరంవ్యోమం పరమార్ధం పరాత్పరం।
సత్యం సర్వగతం బ్రహ్మం సఏవ పరమం శివః।
ఆనందపరబ్రహ్మాయ చలంసంనదా।
శుద్ధబుద్ధమహార్లింగం సఏవ పరమం శివః॥


4.

బిందుమధ్యే జగత్సర్వం బిందుత్రైలోక్యదర్పణం।
బిందుమధ్యస్థతం బ్రహ్మం బిందువచలమవ్యయం॥


5.

విష్ణుయో యోనిసంయ్యుక్తం రుద్రాలింగమేవచ।
బ్రహ్మాణబిందుసంప్రోక్తం త్రిమూర్తి జగదోద్భవః॥


6.

అస్తిభాతి క్రియం రూపం నామచేతస్య పంచకం।
ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం ప్రకృతిద్వయం॥

శ్వాసలు నడిచే కాలనిర్నయము ద్విపదలో తెలిపెదము.