సంశ్లిష్ట వాక్యాలు
59
2. 722 : స్థితిబోధక క్రియలనుగాని, సంఘటనాత్మక క్రియలనుగాని నామ్నీకరించి వ్యాపారాద్యంతాలను సూచించే క్రియలతో వాడలేం.
*(161) | a. ఆమె అందంగా ఉండటం మొదలు పెట్టింది. | |
చివరి రెండు సంఘటనబోధకాలు (events} కావటంవల్ల ఈ వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.
భావార్థకాలు సంఘటనాత్మక నామాలుగా ప్రవర్తించినప్పుడు 'జరుగు' అనే క్రియతో వ్యాకరణ సమ్మతాలవుతై.
(162) | a. వాడికి కాలు విరగటం జరిగింది. | |
‘జరుగు' అనే క్రియతో సంఘటన, వ్యాపారార్థక నామాలు కర్తృ పదాలుగా రాగలవు.
2.723 : భావార్థక నామాలు ప్రధాన వాక్యంలో వ్యాపారబోధక నామంగానే గాక జ్ఞానార్థక క్రియలతో అభ్యసనార్థక నామంగా రాగలదు.
(163) | a. నాకు వచన పద్యాలు రాయటం వచ్చు. | |
ఈ పై వాక్యాలలో మిషనుకుట్టటం వచనపద్యాలు రాయటం అనే నామాలను ఉపవాక్యాలుగా, అంటేవాక్యంనుంచి నిష్పన్నమైనట్టుగా భావించ నక్కర్లేదు. అభ్యసనార్హంగా భావించిన ఏ వ్యాపారాన్నైనా, క్రియ అయితే నామ్నీకరించి ఇక్కడ వాడవచ్చు. అయితే ప్రాణి నిర్వహించే వ్యాపారబోధక క్రియలయితేనే ఇట్లా నామ్నీకరించటం సాధ్యం. అందువల్ల వీటిని గుప్త నిర్మాణంలో ప్రాణివాచకకర్త ఉన్న వాక్యాలుగా భావిస్తే వ్యాకరణ ప్రక్రియ తేలిక అవుతుంది.