పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/209

ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 తెలుగు భాషా చరిత్ర

సంవత్సరాల కిందట (SII 7.558.17,1856 ), శుక్రవారం వర్కు (SII 10.762.8,1669).

6.28. సర్వనామాలు : నిర్దేశాత్మక సర్వనామాలలో వాండు (NI 3 రాపూరు 3.35,1638), అతడు (SII 7.558 15,1856). ఆయన (SII 7.845.4, 1682), మహదేక వచనంలోను, వాండ్లు (NI 2 కందుకూరు 52.11,1635), వీరు (SII 10.767.47, 1680), వీండ్ల (NI 2 కందుకూరు 48.31,1650), మహాన్మహతీ బహువచనంలోను, ఇది (SII 7.845.7, 1362), యివి (SII 7.845.7,1682) వరుసగా అహమదేక వచన, బహు వచనాల్లో కనిపిస్తున్నాయి. వాండుతో పోల్చినప్పుడు అతడు, ఆయన ఆధునిక భాషలోలాగా గౌరవార్థకాలై ఉంటాయి. -వాండ్లు, వీండ్లు వంటి బహువచన రూపాలు ఎక్కువగా నెల్లూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వారు, వీరు వంటి ప్రాచీన బహువచన రూపాలు గౌరవార్థకాలుగా పరిణమించగా, పైవి బహువచన రూపాలుగా స్థిరపడి ఉంటాయి. ఆధునిక బహువచన రూపాలైన వాళ్ళు, వీళ్ళు లకు ఇవి!పూర్వ రూపాలు. ఆమె, ఈమె వంటి స్త్రీ వాచకాలు ఈ యుగంలో కనిపించక పోయినా 12వ శతాబ్ధి నుంచీ ఇవి శాసనభాషలో ఉన్నాయి (కందప్పచెట్టి (§ 2.129). అవికి ఔప విభక్తికమైన ఆధునిక రూపం 'వాటిని' కూడా 13వ శతాబ్దినుంచే కనిపిస్తుంది (కందప్పచెట్టి § 2.131). యెవ్వండు (NI 2 నెల్లూరు 11.14,1638), యెవరు (SII 10.763.13,1670) వరుసగా ఏక వచన, బహు వచనాలలో మహద్వాచక ప్రశ్నార్థక సర్వనామాలుగా ప్రస్తుత శాసనాలలో కనిపిస్తున్నాయి.

మధ్యమ, ఉత్తమ పురుష సర్వ నామాలలో అచ్చుతో మొదలయ్యే ఈవు, ఈరు, ఏను, ఏము వంటి రూపాలు ఈ యుగంలో కూడా కనిపించవు. మధ్యమ పురుష సర్వనామాలుగా నీవు (ఏ.వ.) (KI 53.10,1812), మీరు (బ.వ) (SII 10.789.12,1691); ఉత్తమ పురుష సర్వనామాలుగా నేను (ఏ.వ.) (SII 10.773.8,1697), మేము (బ.వ) (SII 5.874.8,1620) కనిపిస్తున్నాయి. ఉత్తమ పురుష బహువచనంలో నేము (SII 16.42.8,1503; SII 10.774.8,1697) అనే రూపం 16వ శతాబ్ధి మొదటినుంచీ శాసనాల్లో కనిపిస్తుంది. మూల ద్రావిడంలో ఉభయార్థక బహువచనంగా *ఞామ్‌ను పునర్నిర్మించటానికి గల