ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 9050-01 శ్రీరాగం సం: 04-564 నామ సంకీర్తన
పల్లవి:
త్వమేవ శరణం త్వమేవ శరణం
కమలోదర శ్రీ జగన్నాథా
చ. 1:
వాసుదేవ కృష్ణ వామన నరసింహ
శ్రీ సతీశ సరసిజ నేత్ర
భూసురవల్లభ పురుషోత్తమ పీత
కౌశేయవసన జగన్నాథా
చ. 2:
బలభద్రానుజ పరమపురుష దుగ్ధ
జలధివిహార కుంజరవరద
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర
కలి దోష హరణ జగన్నాథా
చ. 3:
వటపత్ర శయన భువనపాలన జంతు
ఘటకార కరుణ శృంగారాధిప
పటుతర నిత్య వైభవ రాయ తిరువేం
కటగిరినిలయ జగన్నాథా