ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 9035-02 బౌళిరామక్రియ సం: 04-555 అంత్యప్రాస
పల్లవి:
అదరీ బెదరీ నంతనంత
అదవదలై మాయామృగము
చ. 1:
పొలసీ మలసీఁ బొదలీఁ గదలీ
నెలసీఁ బలుమారు నెలవులను
కలసీ మృగములఁ గ్రమ్మర బెదరీ
అలసీనటు మాయామృగము
చ. 2:
దాఁగీ లోఁగీఁ దటుకన వెనుకకు
వీఁగీ నేఁగీ విసవిసనై
రేఁగీగతి వచరింపుచుఁ జూపుల
నాఁగీనదె మాయామృగము
చ. 3:
వెంకటగిరి రఘువీర నీముందర
కొంకీఁ గొసరీఁ గొనగొనల
జంకెల బాణాసన బౌణంబున
సంకెలఁ బడె మాయామృగము