ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0032-4 శంకరాభరణం సంపుటం: 06-120
పల్లవి:
తమ్మిం దమ్మిం దాఁకె తపియించంగా
అమ్ములే యమ్ములఁ దాఁకె నంతలోననె
చ. 1:
చందురుం జందురు నేఁచె జాలికి జాలివుట్టె
మందమారుతము సోఁకె మందమాయే గాలి
తీఁగె సోఁకి తీఁగ వాడె తేనె దాఁకి తేనె చిందె
చేఁగ చిగురునం గాఁగె చెంగావి చిగురు
చ. 2:
వేంకటేశ్వరునిమిఁద వేంకటేశ్వరుండు వచ్చె
సంకె మీదసంకె దేరె సకియభాగ్యమే