పుట:కాశీఖండము.pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 85

హంబు లుద్ఘాటించుతనమేటిపొడవు నేలసపాటంబుగా వంచి వింధ్యాచలం బమ్మహానుభావు నెదుర్కొనియె. అప్పు డర్కునిరథంబు చక్కఁ జాయ నడచె. పవనస్కంధంబులు నిర్బంధంబు లుడిగె. ఇందుండు చిందిలిపడసాగె. మంగళబుధబృహస్పతిశుక్రశనైశ్చరరాహుకేతువులు దమతమతానకంబులు దప్పక చరింపం దొడఁగిరి. విశ్వప్రపంచంబు సర్వంబును గ్రామంబున యథాపూర్వంబునం బ్రవరిల్లె. కాలంబు లేర్పడియె. అనంతరంబ పురుషాకారంబు దాల్చి యజ్ఞగతీధరంబు గొన్ని యంజలం బ్రత్యుద్గమించి. 159

సీ. ప్రణవపంచాక్షరోపనిషత్ప్రపంచంబుఁ
గడదాక నెఱిఁగిన కఱతలాని
వాతాపిదైత్యు నిల్వలునితోఁ గూడంగ
జఠరాగ్ని వేల్చిన సవనకర్తఁ
గోపించి నహుషునిఁ గుంభీనసంబుగా
హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునాఁడు వండుపట్టిననీటి
కాలుష్య ముడిపెడు కతకఫలముఁ
తే. బాండుభసితత్రిపుండ్రాంకఫాలభాగు
భద్రరుద్రాక్షమాలికాభరితవక్షు
భార్యయును దాను నేతెంచుపరమశైవుఁ
గాంచె వింధ్యాచలేంద్రంబు కలశభవుని. 160

క. కాశీనగరీవిరహ
క్లేశభవక్రోధవహ్నికీలల నాశా