పుట:కాశీఖండము.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84 శ్రీకాశీఖండము

చ. దురితము లేన్ని చేసితినొ తొల్లిటిజన్మమునందుఁ గాశికా
పురమున సర్వజంతువులు భూరివిముక్తులు గొల్లలాడఁగా
హరహర! నెత్తిఁ జేతు లిడి యశ్రులు గన్నుల నొల్క నిప్డు నే
గరినిభయానతో నిదె పొకాలెదమిన్నులు వడ్డచోటికిన్. 156

తే. ఏల మింగితి వాతాపి నిల్వలు? నిల
నేల త్రోచితి దివినుండి యోలి నహుషు?
నాప్రభావంబు గాదె న న్నదిరిపాటు
కాశి వెడలంగఁ ద్రోచె నిష్కారణంబ. 157

సీ. ఎన్నఁడు చూతునో యింకొక్కమా టేను
బ్రకటకైవల్యాంబురాశిఁ గాశి?
నెన్నఁడు చూతునో యింకొక్కమా టేను
జగదేకపావని జహ్నుకన్య?
నెన్నఁడు చూతునోయింకొక్కమా టేను
మహిమాస్పదము ముక్తిమంటపంబు?
నెన్నఁడు చూతునో యింకొక్కమా టేను
విశ్వలోకారాధ్యు విశ్వనాథు?
తే. నింక నెన్నఁడు చూతునో యేను డుంఠి?
నింక నెన్నఁడు చూతునో యేను దుర్గ?
నింక నెన్నఁడు చూతునో యేను వటుకు?
నింక నెన్నఁడు చూతునో యేను గుహుని?158

అగస్త్యుండు లోపాముద్రతోఁ గాశిం బెడదబాయుట వింధ్యగర్వాపహరణము

వ. అనుచు నల్లనల్లన వచ్చుకుంభసంభవు దవ్వుదవ్వులం గాంచి కాంచనశిరశ్శృంగశృంగాటకంబులం గమలభవాండకటా