76 శ్రీకాశీఖండము
తే. నాభికందంబుక్రిందట నలినగంధి!
కుండలీశక్తిదేవత యుండునెలవు
కుండలీశక్తి నాఁగఁజకోరనేత్ర!
పాముచందాన నుండెడు ప్రథమధమని. 125
వ. అది మూల ప్రకృతి. మహదాదిప్రకృతివికారంబు లేడును దానిమేనిమలకలు. అప్పాపచేడియయు సుషుమ్నానాడితోడం బెనంగొనియుండు.126
క. గిటగిట నెనిమిదిమలకలఁ
గుటిలీభావము భజించి కుండలి ప్రాకున్
నిటలాంతముదాఁకను గ్రిం
దటిమొగ మై వ్రేలు నండ్రు దద్జ్ఞులు దానిన్. 127
తే. దానిచుట్టును నుండు లేఁదలిరుఁబోఁడి!
డెబ్బదియు రెండువేలు నాడికలు మేన
ముఖ్యనాడులు వానిలో ముద్దరాల!
పదియునాలుగు ననుచుఁ జెప్పుదురు బుధులు. 128
వ. ఇడానాడియందుఁ జంద్రుం డధివసించియుండుం గావున నందుఁ బవనం బుద్గమించుకాలంబు రాత్రి. ప్రవేశించుకాలంబు పగలు. పింగళానాడియందు సూర్యుం డధివసించి యుండుఁగావున నందుఁ బవనం బుద్గమించుకాలంబు దివంబు. ప్రవేశించుకాలంబు రాత్రి. ప్రాఙ్ముఖస్థితుఁ డగుపురుషునకుఁ బింగళానాడి దక్షిణదిక్కున నిడానాడి యుత్తరదిక్కున నుండుఁగావున మకరాయనసమయంబున దక్షిణదిగవస్థితుం డగుసూర్యుండు గర్కటకాయనపర్యంతంబు నుత్తరంబు నడచుటం జేసి యుత్తరాయణం బయ్యె. ఈ చందంబునం బింగళా