పుట:కాశీఖండము.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 శ్రీకాశీఖండము

రసంబు నవ్వితీయంబు నగునిష్కళంకస్వరూపంబును నర్ధనారీశ్వరాదిరూపం బైనసకలస్వరూపంబును నగువిశ్వనాథు నుపాసింప నొడగూడదయ్యెం గావున నింక నేను భావతీర్థంబున యాభర్గు నుపాపించెద. సంసారసాగరంబుఁ దరియింపసాధనం బగుటఁ దీర్థం బయ్యె. ఆభ్యంతరం బైనయవిముక్తతీర్థంబు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు లబ్ధస్థానంబగుటం త్రిమూర్తులకు సాధారణం బయ్యును మహేశ్వరునకుం బ్రధానస్థానం బై యుండు. 118

సీ. ఏవిధంబున నాత్మ నెఱుఁగుదు నే నంచు
యాజ్ఞవల్క్యుని నత్రి యడిగెఁ దొల్లి
యవిముక్తమునయం దుపాస్యుఁ డాత్ముఁ డటంచు
యాజ్ఞవల్క్యుం డత్రి కానతిచ్చె
నాయవిముక్త మెం దాశ్రయించినది యం
చడిగెఁ గ్రమ్మఱ నత్రి యాజ్ఞవల్క్యు
నిసుపారి వరణయందును నసియందును
నది యుండు నని యత్రి కాన తిచ్చె
తే. యాజ్ఞవల్క్యుండు భూమధ్యమాస్థలంబు
వరణ సంసారదోషనివారణంబు
నాశి యింద్రియదోషవినాశనంబుఁ
జేయుచుండుట యిట నిర్వచింపఁబడియె. 119

వ. అభ్యంతరావిముక్తక్షేత్రదర్శనంబు బ్రహ్మనాడీపవమానజయంబునం గాని సిద్ధింపదు. 120

సీ. ప్రకృతిరూపిణి యైనపాఁపపూఁబోడికి
మహదాదివికృతులు మలక లేడు