52 శ్రీకాశీఖండము
సీ. డుంఠివిఘ్నేశుఁ డుండుప్రదేశ మీక్షించి
లోలారునగరిమోసాల వెదకి
దండపాణ్యానవభాండేశ్వరంబులు
గుక్కుటస్థానంబు గుద్దలించి
కేశవస్వామిలోఁగిలి పరామర్శించి
కాలభైరవదేవుగవను జూచి
శ్రీవిశాలాక్షిగోష్ఠీవాటి శోధించి
యపవర్గమంటపోపాంత మరసి
తే. విబుధగంగాతరంగిణీవేణిమధ్య
సైకతోత్సేకవేదికాసంప్రరూఢ
తరుణమంజులకుంజవైతనకుడుంగ
వీధికలయందు దృష్టి యావిష్కరించి. 41
వ. కుంభసంభవు నన్వేషించువారు జగద్ధితకార్యారంభులు జంభమథనపురోగము లైనసురలును గీష్పతిప్రధాను లైనమునులును నానందకాననంబన మహాశ్మశానంబనం రుద్రావాసంూన గాశియన వారణాసియన నవిముక్తక్షేత్రంబన లోలార్కకేశవులు కోటిద్వయంబును, భాగీశథి నారియు, ధర్మంబు శరంబును, గలి లక్ష్యంబును, విరూపాక్షుండు ధన్వియుంగా ముక్తిపురంధ్రీభ్రూలతానుకారంబును జంద్రరేఖాఛాయాప్రకారంబై తాను గోదండంబుభంగి నంగీకరించి విశ్వేశ్వర శ్రీమహాదేవునకు నిఖిలదేవతాసార్వభౌమునకుఁ ద్రైలోక్యసామ్రాజ్యపట్టాభిషేకంబునకుఁ దగిన హేమపీఠంబునుంబోని యమ్మహాస్థానంబుఁ గలయఁ