పుట:కాశీఖండము.pdf/494

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

482

శ్రీకాశీఖండము


సర్గిక మైనతేజమున సంతస మందఁగఁ జేయు నన్ను నీ
మార్గము కాశికానగరిమార్గముఁ జూడుమ యెద్ది యెక్కుఁడో?

211


క.

నీ వెంతప్రియవు నాకును
దేవి! విశాలాక్షి సర్వదేవనమస్యా
కైవల్యజన్మనినిలయము
శ్రీవారాణసియు నంతప్రియ మైయుండున్.

212


తే.

స్కందనందిమహాకాళకరటిముఖులు
నైగమేషవిశాఖులు నలిననేత్ర!
పట్టిచూడంగ నా కెంత పరమహితులు
పాయ కవిముక్తమున నున్నప్రజలు నట్లు.

213


తే.

వేల్చినారు తపంబు గావించినారు
తీర్థములు సర్వములును సాధించినారు
కమలలోచన! యానందకాననమునఁ
బాయకుండెడుజనులు ప్రాగ్భవమునందు.

214


తే.

భువనభారంబునకుఁ గాఁగఁ బుట్టినారు
కాశిఁ గాఁపున్న ప్రజలు దక్కఁగ లతాంగి
యక్షగంధర్వగరుడవిద్యాధరులును
దందశూకులు నర్థవాదంబుగాదు.

215


తే.

[1]కాశిపురి నున్న యట్టిపుల్కసునిఁ బోల
రితరభూముల నున్నవా రెంతవారు
శోత్రియులయింటఁ బుట్టనీ శ్రుతులు నాల్గు
నభ్యసింపంగ నీసరోజాయతాక్షి?

216


సీ.

సాక్షాద్ద్విసంఖ్యాధికేక్షణుం డనవచ్చు
        గాశీఁ గాఁపుర మున్నకాఁపుకొడుకు

  1. కాశికాపురినున్న పుల్కసుని