పుట:కాశీఖండము.pdf/492

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

480

శ్రీకాశీఖండము


ద్రేకవిద్రావణప్రౌఢిముద్రాసమున్నిద్రరౌద్రోదయస్ఫూర్తులై యుందు, రాచక్కటిం గౌస్తుభేశుండు సిధ్ధీశుఁడుం గామకుండంబు లక్ష్మీశ సత్యామృతేశానులుం జంద్రకుండంబు నింద్రేశచంద్రేశ్వరాగ్నీశులున్ బాలచంద్రేశుఁడు్ వృద్ధకాలేశలింగంబు దక్షేశలింగంబునై రావణాధీశలింగంబు ధన్వంతరీశానలింగంబునుం దుంగనాథేశలింగంబు శ్రీభైరవాధీశలింగంబు దర్శించు మర్త్యుండు మృత్యూద్భవంభైన భీత్యుద్గమంబున్ బెడంబాయు వ్యాసేశ్వరవ్యాసకుండబులుం బంచచూడాసరోమధ్యమేశానమందాకినీతీర్థముల్ రామభద్రేశుఁడున్ జంబుకశ్రీమతంగేశులున్ సిద్ధకూపంబు సిద్దేశుఁడున్ వ్యాఘ్రలింగంబు వాతాతపేశానుఁడున్ హారితేశుండు గాణాదకూపంబు గాణాదలింగంబు నాషాఢనాథేశుఁడున్ భారభూతేశుఁడున్ శ్రీగభస్తీశుఁడున్ మంగళేశుండునుం ద్వష్టృనాథేశుఁడున్ దైవదైతేశుఁడున్ మంగళాదేవియున్ శ్రీమయూఖార్కుఁడున్ [1]వ్యాఘ్రపాదేశుఁడున్ శ్రీవిభాండేశలింగంబు సిద్ధేశలింగంబు నాలక్షకోట్యర్బుదన్యర్బుదానేకలింగంబు లాకాశగంగాప్రతీరంబునన్ గాశికాక్షేత్రసీమావిభాగంబునన్ భోగమోక్షంబులున్ సేవకశ్రేణి కీఁజాలుఁ గల్యాణి! కాత్యాయనీ! దేవి! నారాయణీ! శ్రీవిశాలాక్షి! సత్యంబు సత్యంబు సత్యంబు ముమ్మాటికిన్.

204


క.

గంగాధరుసన్నిధి హరి
ముంగలఁ జదివినను విన్న ముక్తిధరిత్రీ

  1. శీఘ్రచండీశుఁడున్ చిత్రగుప్తేశుఁడున్ నిర్జరాధీశుఁడున్ నిమ్నగేశుండు శుక్రేశుఁడున్ శక్రకూపంబు శ్రీదాదికాధీశుఁడున్ శ్రీఆదికేశేశుఁడున్ పిశాచేశుఁడున్