సప్తమాశ్వాసము
479
| సిద్ధివినాయకుండు కామధేనువు; తరుణ! హిరణ్యకశిపులింగంబు ముంగిటినిధానంబు; మందగమన! మందాసురేశ్వరుండు వందారుజనమందారంబు; సుదతి! సతీశ్వరస్కందేశ్వరప్రసన్నవదనేశ్వరులు శాశ్వతైశ్వర్యసంధాయులు; చండి! ప్రసన్నోదకుండంబు దురితఖండనంబు; అష్టాదశయోగపీఠికారాధిష్ఠాత్రి! యట్టహాసేశ్వరుండు ఘటితాఘప్రఘట్టుండు; జగద్ధాత్రి! మిత్రావరుణవృద్దవసిష్టకృష్ణయాజ్ఞవల్క్యప్రహ్లాదవైరోచనేశ్వరులు సర్వాభీష్టఫలప్రదాయకులు; పల్లవపాణి! బాణచంద్రవిద్యేశ్వరులు క్షుద్రోపవనవిద్రావణులు; కర్ణమోటీ! వికటాదేవి జంబేటికాలువ; గౌరీ! వీరేశ్వరుండు వారాణసీపంచముద్రమహాపీఠపట్టాభిషిక్తుండు; లీలావతి! వాలిహనూమదధీశ్వరుల లింగంబులు మంగళప్రదంబు లని చెప్పి వెండియు. | 203 |
దండకము. | విను మభినవవిద్రుమాతామ్రదంతచ్ఛదా! భద్రకుండంబు గండూషితాశేషదోషంబు భద్రేశ్వరశ్రీమహాదేవుఁ డందుండు, దత్కుండపూర్వోత్తరాశావిభాగంబునం జక్రకుండంబు చక్రేశుఁ డందుండు, దత్సేవ సంసారచక్రక్రమప్రక్రియాధిక్కృతి, ప్రౌఢ! తన్నైరృతాశంద్రికూటేశ్వరుం డుండు, నాచేరువన్ శూలికుండంబు, శూలాహ్రదస్నానపానంబులన్ మానవుం డొందు నేనోనివృత్తిం దదగ్రంబున న్నారదేశుండు గోటీశుఁడుం గోటితీర్థంబు నంగారకాధీశుఁడున్, దుర్గ! చాముండియున్ భార్గవేశుండును న్గాపిలేశుండు నోంకారమత్స్యోదరీతీర్థరాజంబులున్ శంకుకర్ణేశ్వరాఘోరనాథేశుఁడున్ రుద్రవాసాహ్రదంబున్ మహాపాతకోపద్రవో | |