ఈ పుట అచ్చుదిద్దబడ్డది
460
శ్రీకాశీఖండము
| భూతి సర్వాంగకంబుల సముద్ధూళించు | |
తే. | శ్రుతులు నా ల్గేర్పఱచినట్టి సూక్ష్మబుద్ధి | 128 |
వ. | ఇవ్విధంబునం బెద్దకాలంబు కాశీనగరంబునఁ గృష్ణద్వైపాయనుండు శిష్యవర్గంబును దానును నపవర్గపదవీకల్యాణలాభార్థంబు వసియింప నమ్మునిమనస్స్థైర్యంబు పరీక్షింపం దలంచి విశ్వేశ్వర శ్రీమహాదేవుండు విశాలాక్షి కి ట్లనియె. | 129 |
గీ. | బాదరాయణచిత్త మేపాటియదియొ | 130 |
వ. | అనిన నద్దేవి మహాప్రసాదం బని యఖిలభూతాంతర్యామిని గావున గాశికానగరంబున గృహిణీగృహస్థులయంతరంగంబుల నధివసించి భిక్షాప్రదానప్రతిష్టంభకారణంబై యుండె; నంత కృష్ణద్వైపాయనుండును. | 131 |
సీ. | [1]కాలోచితము లైనకరణీయములు దీర్చి | |
- ↑ ‘గంగలోఁ జక్రపుష్కరిణీహ్రదంబున నఘమర్షణస్నాన మాచరించి
నిలుచుండి కావించి నియతిమై గాయత్రి సంఖ్య యష్టోత్తరశతము గాఁగఁ
బఠియించి యప్పుడు పత్రపుష్పములతో శివు నీలకంఠుని సేవ చేసి
యంతరంగంబున నభవుని నిడుకొని శాంతచిత్తంబున సంధ్య వార్చి
గీ. యగ్నికార్యముఁ దీర్చి కౌమారిఁ గొల్చి’ అని యొక వ్రాఁతపుస్తకమునఁ బాఠాంతరము.