454
శ్రీకాశీఖండము
శా. | ‘ఎట్టెట్టూ! వినమైతి మింక నొకమా ఱేర్పాటుగాఁ జెప్పుమా | 108 |
క. | భుజవాక్సంస్తంభంబునఁ | 109 |
వ. | వచ్చి ‘యో బాదరాయణుండ! బుద్ధిమంతుండ విట్టియపరాధం బెట్టు సేసి?’ తని కినిసి, ‘నందికేశ్వర! నాకుం బ్రియంబుగా నీతని(యపరాధంబు క్షమించి) కరుణార్ద్రదృష్టిం జూడు’మని వేడుకొనియె. అప్పుడు సత్యవతీవందనునకు వాగ్భుజాస్తంభనంబులు నివర్తిల్లె. కృష్ణద్వైపాయనుండును బహుప్రకారంబులం బరమేశ్వరుం బ్రస్తుతించి తనపేర వ్యాసేశ్వరలింగంబుఁ బ్రతిష్ఠించె. ఆలింగంబును దన్ను భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అనిన విని కుంభసంభవుండు శంభునందనున కభివాదనంబు సేసి సవినయంబుగా నిట్లనియె. | 110 |
సీ. | శైలారి వాగ్భుజాస్తంభం బొనర్చుట | |