431
సప్తమాశ్వాసము
దుర్వాసోలింగమాహాత్మ్యము
వ. | ఇందు దుర్వాసేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద నాకర్ణింపుము. | 24 |
తే. | సకలదేశంబులందును సంచరించి | 25 |
వ. | ఇట్లు వచ్చి యమ్మహాభాగుండు భాగీరథీనదీమాతృకంబులై ముక్కారును బండు పంటవలంతికేదారక్షేత్రంబులు, నిర్ధూతకలధౌతశలాకాశకలశంక నంకురింపఁ జేయఁ జాలు క్రొత్తమొలక లొత్తునవియును, సుకుమారశుకచ్ఛదచ్ఛటాదాయాదంబులై యడ్డపచ్చఁ గొనునవియును, నార్యావర్త దేశమత్తకాశినీజంఘాకాండ పాండిత్యంబు గండూషించి చిగురుపొట్టలఁ గనుపట్టునవియును, బదియాఱువన్నియకడానికుందనంబు హెచ్చు కుందాడుపసిమిఁ బచేళిమంబు లగునవియు నైన ప్రాసఁగుంజేలును, వికటఘటీయంత్రప్రాంతవాపికాసలిలధారాధోరణీప్రవాహసేకసంవర్థితంబు లై జంబూజంబీర నారికేళ పనస సహకారకురవకవకుళాశోకశాకోటకుటజముఖ నిఖిలవిటపివాటికాభిరాామంబులైన యారామంబులును, సముద్దండపుండరిక కువలయ కుముదషండమండితంబు లగుతీర్థకుండంబులును, [1]నారసాతలగంభీరరసలిలసంభారంబు లైన పరిఖాచక్రంబులును, గనకగిరిప్రదీప్తవప్రాకారంబు లగు ప్రాకారంబులునుం గనుంగొనుచు, భూర్భువస్వర్మహాలింగ | |
- ↑ సారసోత్సలోదంచితసలిలసంభారరసాతల