షష్ఠాశ్వాసము
401
| కుంభినీధ్రసన్నిభాకారులు కుఠారభిండివాల మండలాగ్ర త్రిశూలపట్టినప్రాసతోమరంబులు ధరియించి యమ్మహాదేవిం జుట్టుముట్టి పట్ట నురవడించిన. | 227 |
మ. | ఘనరౌద్రోద్ధతి భద్రకాళికకటాక్షజ్యోత్స్న కెంపార ను | 228 |
తే. | పగర నిబ్బంగి శతకోటిఁ బాఱ నూఁది | 229 |
తే. | అంబరక్షోణిచక్రమధ్యమున నుండి | 230 |
వ. | అప్పుడు శతకోటిరథంబులు నర్బుదశతద్వయగజంబులు గోట్యర్బుదహయంబులు నసంఖ్యాతయోధులుం గొలువ నేతెంచుదుర్గాసురునిముందట బృందారకమార్గంబున నిరర్గళాటోపంబున నేతెంచు కాళరాత్రిని దవ్వుదవ్వులం గనుంగొని మహాభుజసహస్రదివ్యాయుధయు మహాతేజోపబృంహితయు మహాఘోరప్రహరణపరంపరాధగధ్ధగితధామచ్ఛటాచ్ఛాదితాంబరయుఁ బ్రోద్యచ్చండమార్తాండమండలసహస్రకాంతిజ్యోతిశ్చక్రమధ్యవర్తినియు లావణ్యవార్ధిసమృద్ధి | |