షష్ఠాశ్వాసము
397
| పయోవేణి నిర్ధూతపాదారవింద | 211 |
వ. | మహారుండకుం బశ్చిమభాగంబున స్వప్నేశ్వరి. ఆస్వప్నేశ్వరి భజించువారలకు భూతభవిష్య[1]చ్ఛుభాశుభార్థంబులు గలలోనం దెలుపుచు నవమ్యష్టమీచతుర్దశీదివసంబులం బూజఁగొను. ఆస్వప్నేశ్వరికి వరుణదిగ్భాగంబున దుర్గాదేవి. ఆ దుర్గ కాశీక్షేత్రంబున దక్షిణద్వారదేశంబు రక్షించుచుండు ననినం గుంభసంభవుండు శంభుసంభవున కి ట్లనియె. | 212 |
గీ. | తుహినగిరి రాజకన్యక దుర్గ యయిన | 213 |
దుర్గామాహాత్మ్యము
వ. | దుర్గుం డనుపేర నొక్కరాక్షసుండు రురునికొడుకు తపోబలంబున నవధ్యుఁ డై భూర్భువస్స్వర్భువనంబులు బాధింపం దొడంగిన దేవతలు మహేశ్వరు నభయంబు వేడిన నట్లగా నొసంగి శివుండును రాక్షసునిం భంజింప దాక్షాయణి నియోగించిన. | 214 |
గీ. | గౌరి వింధ్యాద్రి కేతెంచి కాళరాత్రి | 215 |
- ↑ ద్వర్తమానశుభాశుభంబులు