388
శ్రీకాశీఖండము
| దిశాభోగంబులు బుగులుకొన మూర్ధోద్ధూననంబున బ్రహ్మాండభాండంబు దశనకులిశకోటి నుత్పాటించుభంగి నంగీకరించుచు, సముద్దండశుండాకాండగండూషితోజ్ఝితం బగువిబుధనిర్ఝరిణీపాథఃపూరంబునఁ బయోధరవిధిచక్రంబు నీర్కొలుపుచుఁ, జరణఘట్టనంబునం బుడమిం గదిసిల్లినం గపటకిటిజఠరకమఠభుజగపరివృఢులు గూనిగిలం బడఁ గఠోరఫూ(ధూ)త్కారపవనవారాభిఘాతంబున జీమూతవ్రాతంబు చెదరి పఱవఁ గర్ణతాళదుందుభిధ్వానంబున ధరణికుధరగుహాక్రోడంబులం బ్రతిధ్వనులు పుట్టింప నుచ్చకుంభక్రూరాట్టాలకం బగుట గర్వంబునకు నివాసదుర్గంబును, శీకరాసారశిశిరం బగుటఁ గ్రోధంబునకు విహారధారాగృహంబును దానప్రవాహంబులకుఁ బ్రావృటాలంబును, దర్పాంధకారంబునకుఁ గాళరాత్రిసమయంబును నై [1]యానందకాననంబున నవష్టంభసంరంభంవిజృంభణంబున. | 175 |
స్రగ్ధర. | చిందెం జెండాడె మట్టెం జిరిమె విఱిచెఁ గ్రొచ్చెన్ విఘట్టించె దంచెన్ | 176 |
వ. | మఱియు. | 177 |
- ↑ సయాకారంబున గజాసురుండ