380
శ్రీకాశీఖండము
వ. | విశ్వేశ్వరుండును గైసేసి భవానీసహితుండై యద్దివ్యస్యంచనం బెక్కి, ముప్పదిమూఁడుకోట్లదేవతలును, గోట్యయుతద్వయప్రమథగణంబులును, నవకోటిదుర్గలును, కోటిభైరవులును, గోటికుమారు, లేఁడుకోట్ల వినాయకులును, షడశీతిసహస్రమునులు, నందఱగృహమేధులును, మూఁడుకోట్లు పాతాళతలభుజంగంబులును, రెండుకోట్లు దైత్యదానవులు, నష్టాయుతగంధర్వులును, గోట్యర్ధలక్షరాక్షసులును, బదివేవురు విద్యాధరులును, నఱువది వేలప్సరసలు, నెనిమిదిలక్షలు గోమాతలును, షణ్ణపత్యయుతసుపర్వులును, సప్తసాగరంబులును, నెనిమిదివేలు గిన్నరులును, మున్నూఱు వైవస్వతులును గొలిచి వాయువేగంబున ముహూర్తమాత్రంబున నభోమార్గంబున జని కాశిం బ్రవేశించె. అప్పుడు గోమాతలు దుగ్ధవర్షంబులు కురిసిరి. జైగిషవ్యుం డనుమహామునీశ్వరుండు వేదార్థసారంబు లగు కైవారంబులఁ బరమేశ్వరుం బ్రస్తుతించె. అప్పరమేశ్వరుండు జ్యేష్ఠమాసంబున శుక్లపక్షంబునఁ జతుర్దశినాఁడు ప్రవేశించె. అది కారణంబుగా జ్యేష్ఠస్థానంబనుతీర్థంబును, జైగిషవ్యస్తోత్రంబు కారణంబుగా జైగిషవ్యతీర్థంబును, గోమాతృదుగ్ధవర్షంబు కారణంబుగా క్షీరోదతీర్థంబునుం గలిగె. ఇట్లు కాశీపట్టణంబు ప్రవేశించి. | 148 |
తే. | బ్రహ్మవిష్ణువిహితపట్టాభిషిక్తుఁ డై | 149 |
వ. | అందు. | 150 |