షష్ఠాశ్వాసము
373
| శ్రీమణికర్ణిక యణిమాది మహా | 125 |
వ. | మణికర్ణికాతీర్థంబునక వాగ్భాగంబునం బాశుపతతీర్థం; బందు బశుపతీశ్వరుండు లింగరూపధరుండై భవపాశమోక్షంబు సేయు. పాశుపతంబునకుఁ బురోభాగంబున రుద్రావాసతీర్థం బాతీర్థంబునకు రుద్రేశ్వరు డధిదేవత. రుద్రావాసతీర్థంబునకు యామ్యదిగ్భాగంబున విశ్వతీర్థం, బందు తారకేశ్వరుండు విశ్వాభిధాన యగుగౌరితోఁ గూడి విశ్వపూజ్యుండై యుండు. విశ్వతీర్థంబునకు సంగడి మోక్షతీర్థంబు. మోక్షేశ్వరునకు సమీపంబున నవిముక్తేశ్వరంబు. అందులకు సమీపంబునఁ దారకతీర్థంబు గలదు. అందుఁ దారకేశ్వరుండు సంసారతారకుం డధివసించు. తారకతీర్థంబునకు సమీపంబున స్కందతీర్థంబు. స్కందతీర్థంబునకు నవ్వల డుంఠితీర్థంబు. డుంఠితీర్థంబునకు సమీపంబున భవానీశంకరతీర్ణంబు. | 126 |
సీ. | మణికర్ణికాతీర్థమధ్యంబునకు సాగి | |