360
శ్రీకాశీఖండము
| ఖర్వవినాయకుండు యమతీర్థంబునకుఁ బశ్చిమదిగ్భాగంబున సిద్ధనాయకుండు; వీరు బాహ్యావరణదేవతలు. గంగాపశ్చిమతీరంబున నుత్తరార్కుసమీపంబున లంబోదరవినాయకుం, డాపశ్చిమంబునఁ గూటదండవినాయకుండు, భీమచండునకుం గించిదీశానుగ్భాగంబునఁ గాలకంఠవినాయకుండుఁ, [1]బ్రాగ్దిగ్భాగంబునఁ గూశ్మాండవినాయకుండు, నుద్దండవిఘ్నేశ్వరునకు నాగ్నేయదిగ్భాగంబున డుంఠివినాయకుండు, పాశపాణివిఘ్నేశ్వరునకు దక్షిణంబున వికటదంతవినాయకుండు, సర్వవిఘ్నేశ్వరునకు నిరృతిభాగంబున రాజపుత్రవినాయకుండు, గంగాపశ్చిమతీరంబున రాజపుత్రవినాయకునకు వాయవ్యభాగంబునఁ బ్రణవవినాయకుండు వీరు ద్వితీయావరణదేవతలు. ఉత్తరవాహిని యగువియద్గంగాతీరంబున లంబోదరున కుదగ్భాగంబున వక్రతుండవినాయకుండు, కూటవంతున కుదద్భాగంబున నేకదంతవినాయకుండు, కాలకంఠున కీశానదిగ్భాగంబునఁ గవిసింహద్విపత్రిముఖవినాయకుండు, కూశ్మాండునకుం బూర్వదిగ్భాగంబునం బంచాస్యవినాయకుండు, ముండవిఘ్నేశ్వరున కాగ్నేయదిగ్భాగంబున హేరంబవినాయకుండు, వికటదంతునకు యామ్యంబున నాశావినాయకుండు, రాజపుత్త్రవిఘ్నేశ్వరునకు నిరృతిభాగంబున వరదవినాయకుండు, ప్రణవవిఘ్నేశ్వరునకు పశ్చిమభాగంబునఁ బిశంగిలాతీర్థంబున దేవనదీతటంబున మోదకప్రియవినాయకుండు, వీరు తృతీయావరణదేవతలు. వక్రతుండునకు వాయవ్యభాగంబున గంగాతీరం | |
- ↑ దేహళీవిఘ్నేశ్వరునకు