పుట:కాశీఖండము.pdf/351

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

శ్రీకాశీఖండము


తోయము నీవుపో ద్రుహిణ! తొల్లిటివారలయట్ల కాకుమీ!

29


వ.

అనినం బ్రసాదం బని పనిపూని బ్రహ్మ వృద్ధబ్రాహ్మణవేషంబునఁ గాశిఁ బ్రవేశించి పేరోలగం బున్న దివోదాసు నాశీర్వదించి యి ట్లనియె.

30


తే.

అధిప! యానందకాననాభ్యంతరమున
యజ్ఞములు సేయువాఁడ నీయభ్యనుజ్ఞ
ననుమతింపుము సాహాయ్య మాచరింపు
రాజు నడపింప కెట్లు ధర్మంబు నడచు?

31


తే.

అకట! విశ్వేశ్వరుఁడు లేమి ననదవోలె
నున్నయది కాశికాపురి యోనృపాల!
యున్నవేల్పులు రాకుండ సున్నఁగాని
వామదేవుని రప్పింపవలెఁ జు మయ్య!

32


వ.

అని [1]మైవాకగా నాడి యర్ధాంగీకారంబు వడసి ధాత దశాశ్వమేధయాగంబులు సుప్రయోగంబులుగా నాహరించి బ్రహ్మేశ్వరదేవుఁ బ్రతిష్ఠించె. భాగీరథీపశ్చిమతీరంబున నంతర్గేహంబు దక్షిణద్వారంబున దశాశ్వమేధంబు సర్వతీర్థోత్తమంబు.

33


తే.

ధాత గాశీపురంబునఁ దడయుటయును
నుల్లమునయందుఁ గోపింపకుండె శివుఁడు
రాజమౌళికి మూర్త్యంతరంబు గాదె
గణన సేయంగ నానందకాననంబు?

34


ఈశ్వరుండు ప్రమథులం గాశి కంపుట

వ.

అపుడు గౌరీకాంతుండు నిజాంతర్గతంబున ‘యోగినీబృం

  1. 'మైపోక గా గాడి' అని పా.