324
శ్రీకాశీఖండము
తే. | కదలకుండును మది నెంతకాలమేని | 320 |
వ. | అని చెప్పినం బ్రసాదం బని శివాజ్ఞ శిరంబున వహించి రవి కాశీపురంబున కరిగి యొక్కొక్కమాటు యాచకుం, డొక్కొక్కమాటు దూత, యొక్కొక్కమాటు వదాన్యుఁ, డొక్కొక్కమాటు దీనుం, డొక్కొక్కమాటు గార్తాంతికుం, డొక్కొక్కమాటు దృష్టప్రత్యయవాది, యొక్కొక్కమాటు జటిలుం, డొక్కొక్కమాటు దిగంబరుం, డొక్కొక్కమాటు జాంగలికుం, డొక్కొక్కమాటు పాషండుం, డొక్కొక్కమాటు బ్రహ్మచారి,యొక్కొక్కమాటు గృహి, యొక్కొక్కమాటు వాసప్రస్థుం, డొక్కొక్కమాటు యతి యై నానాప్రకారవేషభాషాచేష్టాయంత్రమంత్రతంత్రమాయాప్రయోగబలంబున. | 321 |
తే. | ఇన్ని విధముల జనియించిన యినుఁడు గాశి | 322 |
వ. | ఇట్లు విఫలప్రయత్నుం డయి యినుండు నిజాంతర్గతంబున. | 323 |
సీ. | కార్యంబు నిష్పత్తిగతికి రాకుండంగ | |