పంచమాశ్వాసము
307
| ఖేదము నొందక నరుఁడు ప్ర | 264 |
వ. | అని చెప్పిన మహాత్మా! యీ ప్రపంచంబు నిర్వికల్పంబు నిరాకారంబు నిరస్తసమసస్తోపాధికంబు. నిత్యంబు నగుపరబ్రహ్మం బేక్షేత్రంబును నాశ్రయించియుండు, నేక్షేత్రంబునంద లలాటనేత్రుండు తారకబ్రహవిద్యావర్ణకర్ణేజపుండై కీటపతంగక్రిమిసరీసృపాదు లగునానావిధజంతువులకుం బ్రాణాంతకాలంబున నభయం బొసంగు, నేక్షేత్రంబునకు నుత్తరవాహిని యనవియత్తటిని యుపకంఠంబునం గంఠముక్తాకలాపంబునుం బోలెఁ బ్రవహించు, నేక్షేత్రంబున కభ్యర్థంబున మణికర్ణికాతీర్థంబు తీర్థరాజంబు రజనీకరకిరణసందోహదానదీక్షాధురంధర వినిర్మలకబంధకల్లోలమాలికాస్ఫాలితమహాదేవదివ్యలింగ శతసహస్రలక్షకోట్యర్బుదన్యర్బుదంబై మహోత్కదంబుఁ గావించె, నట్టియవిముక్తక్షేత్రంబు మహిమ యింకను వినవలతు నానతిమ్మని ప్రార్థించినం గరుణావశంవదుండై శిఖివాహనుం డతని కి ట్లనియె. | 265 |
దివోదాసవర్ణవము
తే. | బ్రాహ్మణోత్తమ! బ్రహ్మకల్పంబునందు | 266 |
సీ. | అంభోధితీరంబు లద్రికాననములు | |