పంచమాశ్వాసము
287
| బరమేష్ఠిం, బాకశాసనపావకపరేతరాజపలలాశిపాశిపవనపౌలస్త్యపశుపతులను, వసిష్ఠాదిమునుల, గంగాదిపుణ్యవాహినులఁ, బ్రయాగాదితీర్థంబుల, మేరుశ్రీశైలాదిపుణ్యపర్వతంబులను, దుగ్ధోదన్వదాదిసముద్రంబుల, మానసాదిసరోవరంబుల, జ్ఞానవాప్యాదిదీర్ఘికల, నందనాదివనంబులఁ, బుష్కరాదిద్వీపంబుల, నార్యావర్తాదిజనపదంబులఁ, గామధుగ్ధేన్వాదిధేనువులం, గల్పవృక్షాదివృక్షంబులం, గాంచనాదిధాతువుల, లక్ష్మ్యాదిపుణ్యాంగనల, గరుడాదిపతంగంబుల, శేషాదిమహానాగంబుల, నైరావణాదివారణంబుల, నుచ్చైశ్శ్రవాదితురంగంబులఁ, గౌస్తుభాదిమణుల, నరుంధత్యాదిపతివ్రతల, రంభాద్యప్సరసల, నైమిశారణ్యాదిపుణ్యారణ్యంబుల, వారణాస్యాదిపట్టణంబుల, విశ్వేశ్వరాదిలింగంబులఁ, బాంచజన్యాదిశంఖంబుల, సుదర్శనాదిదివ్యాయుధంబుల, వేదాదివిద్యలఁ, బద్మాదిపురాణంబుల, మన్వాదిస్మృతుల, గాయత్ర్యాదిమంత్రంబుల, సనకాదియోగీంద్రుల, నోంకారాదిబీజాక్షరంబుల, వ్రీహ్యాదిధాన్యంబుల, నారదాదివైష్ణవుల, బాణాదిశివభక్తుల, బ్రహ్మాదిభాగవతుల, మహాకాళాదిప్రమథులఁ, బద్మాదినిధుల, దధీచ్యాదివదాన్యుల, హరిశ్చంద్రాదిభూపతుల, జననీజనకులఁ, బితరుల, గురులను సంస్మరించి యీయందఱు నాకు నాయురారోగ్యైశ్వర్యంబులు ప్రసాదింతురుగాక యనుచుం బ్రార్థించి ప్రణమిల్లి నిలిచి నిత్యనైమిత్తికాద్యనుష్ఠానంబుల నిష్ఠాపరుం డయి ద్విజుం డొనర్చునది. | 191 |