పుట:కాశీఖండము.pdf/290

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

277


నిండువెన్నెలలు గాయఁ జంద్రికాపాండుతల్పంబున నిద్రించియుండ నిద్రాభంగంబు గాకుండ మెత్తమెత్తన నెత్తమ్మిరేకులకంటెను సుకుమారంబు లైనతనహస్తపల్లవంబుల
నెత్తి గగనమార్గంబున మలయాద్రికిం గొనిపోయె నయ్యవసరంబున.

148


మ.

[1] “రక్కసుఁ డొక్కఁడప్పరిసరస్థలిఁ గ్రుమ్మరి కేళి సల్పువాఁ
డక్కమలాక్షిచక్కఁదన మద్భుత మందుచుఁ జూచి రాగము
న్నెక్కొనఁ దత్తరం బుడుపనేరక మారవికారచేష్టలం
గ్రక్కున దానిఁ బట్టుకొనఁగాఁ గవిసెన్ వడి దుర్మదాంధుఁడై.


వ.

ఇట్లువిద్యాధరుండును వాని నదల్చుచు రోషవేషభీషణాకారుఁడై సమరావష్టంభవిజృంభణంబున నిల్చె నయ్యిరువురు నయ్యవసరంబున.”


శా.

విద్యున్మాలి యనంగ నొక్కదివిషద్విద్వేషి యక్కన్యకన్
విద్యుత్సన్నిభగాత్రిఁ జూచి మదనావేశంబునం బట్టికో
నుద్యోగించిన నాలతాంగి నొకచో యోజించి విద్యాధరుం
డుద్యద్బాహుపరాక్రమస్ఫురణ దైత్యుం దాఁకె నయ్యిద్దఱున్.


క.

ఆహవము చేసి రంగజ
మోహాంధులు గడిమి మెఱసి [2]ముష్టాముష్టిన్
బాహాబాహిఁ గచాకచి
సాహసము జలంబు దివిజసంఘము పొగడన్.

150


వ.

అప్పుడు.

151
  1. ఈరెండును మద్రాస్ ఓరియంటలు లైబ్రరీ ప్రతిలోఁ గనుపట్టుచున్నవి.
  2. అన్నిమాతృకలలో 'ముష్టాముష్టిన్' యని యున్నను 'ముష్టీముష్టి' సరిరూపము.