274
శ్రీకాశీఖండము
| విహరణస్థానంబు విశ్వనాయకునకుఁ | |
తే. | నెద్ధి యకాశికాపురి కేగుదెంచె | 135 |
వ. | ఇట్లు కాశికానగరంబుఁ బ్రవేశించి యీశానుండు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు నిర్మలజ్యోతిర్మయలింగాకారు సహస్రకలశాభిషేకంబు సేయను, దత్పాదతీర్థప్రసాదోదకంబు లాస్వాదింపను దలంచి. | 136 |
శా. | చేతోజాతవిరోధి కాశినగరీక్షేత్రోపకంఠంబునన్ | 137 |
తే. | దృఢముగా నూఁది శూలంబు దివిచె హరుఁడు | 138 |
వ. | భూప్రమాణంబునకు శతగుణప్రమాణం బై శుద్ధస్ఫటికనిర్మలంబును, శరజ్యోత్స్నాస్వచ్ఛంబును, శశిఖండసంకాశంబును, సుధాధారామధురంబును, పాటలీకుసుమసౌరభంబు నైనయవ్వారిపూరంబు వెండితీఁగెయుంబోలె నెగ | |