పుట:కాశీఖండము.pdf/279

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

శ్రీకాశీఖండము


శరణాగతవత్సలుం డగునయ్యీశ్వరుండు వారి నిద్దఱిం గరుణావిలోకనంబుల మన్నించి నిజరూపాంతరం బైనభైరవదేవుం జూచి యీయధ్వర(పురుష)విధాతలు నీకు మాననీయులు. వీరలయెడ నింకఁ గోపాటోపంబులు చాలు. నీవు వైధసం భైనకపాలంబు దాల్చి లోకాచారప్రకటనార్థంబు భిక్షాశనంబు గొనుచుఁ గాపాలికవ్రతంబుతోడ లోకంబులం జరియింపు మని చెప్పి యనంతరంబ.

109


సీ.

మోకాళ్లు దిగకుండ ముడిచి కట్టినధాతు
        శాటంబు గలకటిస్థలముతోడ
దట్టంబు గాఁగఁ జందనపంక మలఁదిన
        యరుణంపువికటదేహంబుతోడఁ
బిల్లికన్నులఁ బోలు పింగళాక్షములందుఁ
        గ్రూరంబు లగుమిడిగ్రుడ్లతోడఁ
బొడకట్టువడుజపాపుష్పంబు చెరివిన
        చికిచికిపల్లవెండ్రుకలతోడఁ


తే.

గఠినదంష్ట్రికాభీలవక్త్రంబుతోడ
జిహనటనత్వరోల్లలజ్జిహ్వతోడఁ
గత్తతోఁ [1]బద్దెతో మహోగ్రత్వ మొంద
ఫాలనేత్రుఁడు సృజియించె బ్రహ్మహత్య.

110


వ.

ఇట్లు సృజియించి దానిం జూచి కాశికానగరంబుదక్క నితరస్థలంబు లెవ్వియు నీకు దుష్ప్రవేశంబులుగావున నీ వితనిపజ్జ వర్తిల్లు మని పలుకు బుండరీకభవశిరఃఖండనుం డైనభైరవుం

  1. అన్ని మాతృకలందు ‘పట్టి’ యనియే యున్నది. ‘కర్త్రీకర్పరహస్తాగ్రాం’ అని సంస్కృతమూలము, పట్టిశబ్దము కర్పరవాచక మగుట విచార్యము.