పుట:కాశీఖండము.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 శ్రీకాశీఖండము

సప్తగోదావరస్వర్ణపుష్కరహేమ
సౌగంధికముల నర్చనము సేయు
గలధౌతపాత్రలఁ గాలాగురుచ్ఛేద
బహులధూపంబుల బరిఢవించు
తే. వేనవేలు నివాళులు విస్తరించు
నమృతదివ్యాన్నముల నుపహార మిచ్చు
సంఘటించు నశేషోపచారములను
బ్రమథనాయకునకు వీరభద్రనృపతి. 48

చ. విలసితకీర్తిశాలి యగు వీరమహేశ్వరు*గేహరంబు శ్రీ
నిలయమునం ద్రిసంధ్యమును నిర్మలసౌధసువర్ణజాలకం
బుల వెడలున్ గిరీశగళమూలహలాహలకాంతిఁ బోలి గు
గ్గులు మహిసాక్షివాసనలఁ గ్రొవ్వినమంగళధూపధూమముల్. 49

ఉ. ఈశ్వరుఁ డింటివేల్పు జగదేకగురుం డగుఘోడెరాయభీ
మేశ్వరుఁ డాత్మవంశగురుఁ డిగులు నిత్యవినోదకృత్యముల్
శాశ్వతధర్మకీర్తులు దలంపఁగ నమ్మినసొమ్ము లాదిగ
ర్భేశ్వరుఁ డౌట నైజ మెనయే నృపు లల్లయవీరశౌరికిన్. 50

సీ. తెంచు నెవ్వనిహేతి దృప్తారినరవర
గ్రైవేయపరిలసత్కంధరముల
ముంచు నెవ్వనికీర్తి ముగ్ధేందుధరకంఠ
కాకోలవిషమషీకాళిమంబుఁ
బెంచు నెవ్వనిబుద్ధి పంచాస్త్రపరిపంథి
పాదపాథోధితాత్పర్యచర్య
మించు నెవ్వనిమూర్తి మీనచిహ్నజయంత
నల నలకూబరాదుల జయించి