248
శ్రీకాశీఖండము
| మౌనంబున జితేంద్రియుండై విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుని దర్శించు నెవ్వండేని వాడు సర్వవ్రతఫలంబులం జేకొను. స్నానదేవతార్చనాజపాదుల మూత్రమలవిసర్జనంబుల సమయంబుల దంతధావనహోమకాలంబుల వాచంయముం డై విశ్వేశ్వరు నర్చించిననరుం డేకవాసరంబునన యావజ్జీవశివార్చనాఫలము నొందు. విశ్వేశ్వరప్రీణనార్థంబు కాశీయందు నిధనంబు నొందుమానవుండు గైవల్యధనలాభంబు లంగీకరించు. నిష్ప్రత్యూహం బైనయాగంబున యోగంబున నానాజన్మోపార్జితం బైనఫలంబు కాశియందుఁ దసుత్యాగంబు చేసినజనునకు సిద్దించు. కాయంబు సాపాయం బనియును, బ్రసూతిమరణక్లేశంబులు దుస్సహంబు లనియును, వితర్కించు నరుఁ డాయురవసానపర్యంతంబుఁ గాశిన యుండునది. | 26 |
శా. | అర్ణోరాశిపరీతభూభువనమర్త్యస్వర్గంఖండంబు సం | 27 |
వ. | అని శంభుండు విశ్వంభరు నిరీక్షించి యింకొక్కవిశేషం బాకర్ణింపుము. భగీరథుం డనురాజన్యుండు కపిలమునిప్రదీప్తకోపానలదగ్ధు లగుసాగరుల నిరయంబువలన నుద్ధరించుటకై తపోవిశేషంబున మందాకినిం గొనితేర నమ్మహానది యిమ్మణికర్ణికమీఁదం బ్రవహింప నదిమొదలుగా నత్తీర్థంబు సురాసురులకు వర్ణింప నశక్యం బై విలసిల్లుచుండు. | 28 |
సీ. | భాగీరథీస్నానపరతఁ బోలంగ లే | |