చతుర్థాశ్వాసము
237
తే. | నఖలలోకములకును బ్రహ్మాండములకు | 298 |
లయగ్రాహి. | మ్రొక్కిరి గణేశ్వరులు మ్రొక్కె జలజాసనుఁడు | 299 |
వ. | ఇవ్విధంబున జతుర్భుజు నిర్భరస్నేహంబున భూర్భువస్స్వర్భువనంబుల సామ్రాజ్యభారభరణంబునకుం బట్టాభిషేకంబు సేసి ఫాలలోచనుండు ప్రావృషేణ్యపయోధరధ్వానగంభీరం బగు నెలుంగున స్వయంభూజంభారిప్రముఖులగు బర్హిర్ముఖు లాకర్ణింప, విష్ణుండ యే ననియును, నేన విష్ణుం డనియును, నాకు విష్ణునకు భేదంబు లే దనియును, హరి మంగళాయతనం బనియును, విష్వక్సేనుండు మాననీయుం డనియును, నారాయణుండు జగద్రక్షాపరాయణుం డనియును, నచ్యుతుం డనాదినిధనుం డనియును, నరవిందలోచనుం డాదిపురుషుం డనియును, హరి సర్వపాపహరుం డనియును, నానతిచ్చి తనయిచ్చ నెచ్చోటి కేనియు విచ్చేసె. ఈయాఖ్యానంబును చతుర్భుజాభిషేకం బండ్రు. దీనిం బఠియించినను, | |