చతుర్థాశ్వాసము
235
| శివశర్మయు నమ్మాటకు సంశయాకులుండగుచుఁ దదూర్ధ్వంబుగాఁ జని చని పుణ్యశీలసుశీలురం జూచి మన కింక నెంత ద వ్వరుగవలయు నెఱింగింపుఁడు. ఇప్పుడు పితామహుండు కాశియందు శరీరంబు విడువనివారికి మోక్షంబు లేదనియె. నాకు నిశ్రేయసంప్రాప్తి యెట్లు గల్గు? అవ్విధంబును వివరింపుఁ డనిన వార లిట్లనిరి. | 291 |
తే. | ఉర్వి కెనిమిదికోటుల యోజనముల | 292 |
వ. | అవ్వైకుంఠంబునకు మీఁదఁ బదాఱుకోట్లయోజనంబుల పొడవున శివలోకంబు కైలాసాహ్వయం బనం దనర్చు. దానికిం బరమం బగు లోకంబు లేదు. | 293 |
తే. | సంశితాచారపర! దాని సంస్తుతింప | 294 |
వ. | అప్పరమస్థానంబునందు నిందుధరుండు గిరినందనాసహాయుండై దణాధిస్కందనందికేశ్వరాదులు గొలువ నుదారవిహారంబులం బ్రవర్తిల్లుచుండు. అవ్విశ్వేశ్వరుండు విశ్వరక్షణార్థంబుగాఁ జతుర్భుజుఁ జతుర్దశభువనాధిపత్యంబునకుం బట్టాభిషిక్తుం జేసి యనంతరంబ. | 295 |