230
శ్రీకాశీఖండము
| డబ బడబానలజ్వాలాజాలలీలావ్రీడావహమహఃపటలపాటలిమపల్లవితదశదిశాభోగ భోగింపం దలంచి పూషవిషమబాణుచిటకంబున నకఠోరదూర్వాంకుచర్వణక్రియాసమభిహారహరితఫేనచ్ఛటాచ్ఛేదపిచ్ఛిలంబును, దారుణ్యదర్పభరకవోష్ణనిశ్శ్వాసధారాధురంధకంబును, జలాచలప్రోథదళసంపుటంబును నగు నాఘోటీవదనంబు చుంబించె. సంజ్ఞయు నిజాంతఃకరణప్రవృత్తియ ప్రమాణంబుగా నతిప్రమాణమూర్తిస్ఫూర్తి యగునత్తురంగంబుఁ బతంగుండ కాఁదలంచి యిచ్చగించె. అత్తళువైన యమ్మత్తకాశిని కించిదున్నిద్రపారిభద్రకలికాచ్ఛాయాముద్ర కుద్ది యగు ముద్ర విరియించుచు మొగుచుచుం గదలకుండిన మోర మోరతో మోపియుఁ, గండంబు గఱచియు, డాసియుఁ, బాసియు, ఱవళి చేసియుఁ, గొంతదడవు వినోదంబునొంది యక్కుహనాహయం బగ్గోడిగ డగ్గఱి క్రీడించి యుండె. అప్పు డమ్మావునకు ముకుగ్రోళ్ల నెక్కి చరమధాతుద్రవంబు కదంబకుసుమకేసరపరాగగంధపాణింధమంబై స్రవించె. అయ్యింద్రియంబున జంద్రబింబానను లిద్దఱు గవలవారు నాసత్యు లనం బ్రభవించిరి. అక్కుమారద్వయంబు. | 274 |
తే. | విబుధవైద్యద్వయం బయ్యె విమలచరిత! | 275 |
- ↑ యతిభ్రంశము. కాననిట్లు పాఠముండి యుండును. చనిరి దంపతు లాత్మీయసదనమునకు. (ఉ. వేం. రం)