ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పీఠిక 7
కృతిపతివంశవర్ణనము
సీ. కలశాబ్ధికన్యకాకరపల్లవద్వయీ
సంవాహనక్రియాసముచితంబు
నిఖిలవేదాంతవాఙ్నిధివధూధమ్మిల్ల
బహుళపుష్పామోదభాసితంబు
ప్రణతనానాసుపర్వకిరీటసంఘాత
రత్నాంశురాజినీరాజితంబు
సనకాదిసన్మునీశ్వరమనోమందిరా
భ్యంతరరత్నదీపాంకురంబు
తే. పతగకేతను శ్రీపాదపంకజంబు
గారణంబుగ జన్మించె భూరిమహిమ
గంగసైదోడు రిపుకోటిగళము త్రాడు
నాలుగవజాతి సమధికోన్నతవిభూతి. 22
శా. ఆవర్ణంబున నుద్భవించి గుణరత్నార్ణోనిధానంబు శ్రీ
దూవూరం బెరుమాళ్ళురెడ్డి యభివృద్ధు ల్గాంచె మృత్యుజయ
గ్రీవాక్ష్వేళకలంకపంకహరణక్రీడాకళాగర్విత
ద్యావాపృథ్వ్యవకాశపేశలయశోధారానభస్సింధువై. 23
తే. అతనియర్ధాంగలక్ష్మి శ్రీయన్నమాంబ
గాంచెఁ దనయుల నర్థార్థికల్పకముల
నల్లయాధీశ పెదకోట యాన్నప్రోల
దొడ్డయేశుల పినకోటరెడ్డివిభుల. 24
సీ. అవనిభారధురీణతాధరీకృతమహా
క్రోడప్రధానుఁ డల్లాడనృపతి