తృతీయాశ్వాసము
147
| నిదియ మే లన్న య ట్లుండు నిదియ లెస్స | 209 |
వ. | అది యెట్లనిన వర్ణాశ్రమాచారంబు శివప్రసాదద్వారంబున జ్ఞానసాధనంబు. అందు వర్ణధర్మంబులు బ్రాహ్మణుండు బృహసృతిసవనంబునను, రాజు రాజసూయంబునను, వైశ్యుండు వైశ్యస్తో(స్టో)మంబునను యజియింతురనునివి యాదిగాఁ గలయది. మఱి యాశ్రమధర్మంబు లధ్యయనాదులు బ్రహచారిధర్మంబులు, గృహస్థధర్మంబు లగ్న్యాధానాదులు, వానప్రస్థధర్మంబు లరణ్యవాసాదులు, యతిధర్మంబులు శ్రద్ధాదులు. బ్రహ్మచారిగృహస్థవానప్రస్థభిక్షు(కు)లయాశ్రమంబు లుత్తరోత్తరంబు లుత్కృష్టంబు, లీచతురాశ్రమంబులవారును నిజకర్మానుష్ఠానంబులు తప్పక యీశ్వరపూజాతత్పరులై సంసిద్ధి వడయుదురు. నాకుం జూడ నన్నియాశ్రమంబులకు నాధారభూతం బై(న)గృహస్థధర్మంబు ముక్తిసాధనంబై తోఁచుచున్నయది. సర్వాశ్రమంబులకు స్వరూపలాభంబు గృహస్థాశ్రమ నిబంధనంబ. కొందఱు ‘వర్ణాశ్రమాచారనిష్ఠునకు బ్రహ్మనిష్ఠ సిద్ధింపదు. బ్రహ్మనిష్ఠ యన సర్వవ్యాపారపరిత్యాగంబున ననన్యచిత్తంబునం జేసి బ్రహ్మంబు నెఱుంగుట, కర్మానుష్ఠానకర్మత్యాగంబులకు స్వరూపంబుఁ బరస్పరవిరోధంబుఁ గావునఁ గర్మశూరునియందు సంభవింప’ దండ్రు. వర్ణాశ్రమకర్మానుష్ఠానవంతునకు యథావశంబున బ్రహ్మనిష్ణాతాత్పర్యంబు సుకరంబు గావునఁ గర్మపరుండు బ్రహ్మంబు నెఱుంగండను నిషేధోక్తి(కిం)బని లేదు. పరదారపరిత్యాగంబునను నాత్మదారపరితోషంబునను ఋతుకాలాభిగమనంబునను | |